Atmanirbhar Bharat: పెయింటింగ్‌ పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

నెల్లిమర్ల: సతివాడ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పెయింటింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

 ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆలిండియా పెయింటింగ్‌ పోటీల్లో ఈ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.పద్మలత, ఉపాధ్యాయ సిబ్బంది, తోటి విద్యార్థులు విజేతలను న‌వంబ‌ర్ 29న‌ అభినందించారు.

చదవండి: Free training in fabric painting: మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ

వెయిట్‌లిప్టింగ్‌ పోటీల్లో విజేతకు అభినందనలు

సతివాడ ఆదర్శపాఠశాల 9 వతరగతి విద్యార్థి బి.రామ్‌జీ కర్నూలు జిల్లాలో ఈనెల 23,25వ తేదీల్లో జరిగిన అండర్‌–17 వెయిట్‌లిప్టింగ్‌ పోటీల్లో ప్రధమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయివెయిట్‌ లిప్టింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు, ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.పద్మలత, ఉపాధ్యాయు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

#Tags