Spot Sdmissions: ఉర్దూ యూనివర్సిటీలో పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

వైవీయూ: కర్నూలు నగరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద పరిమిత సంఖ్యలో మిగిలిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్ల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ వి.లోకనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఇంగ్లిష్‌, ఎం.ఎ.ఎకనామిక్స్‌, ఎం.ఎ.ఉర్దూ, ఎం.ఎస్‌.సి కంప్యూటర్‌ సైన్స్‌, ఎం.ఎస్‌.సి బోటని, ఎం.ఎస్‌.సి జువాలజి, ఎం.ఎస్‌.సి ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో విద్యార్థులను స్పాట్‌ అడ్మిషన్‌ కింద చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

చదవండి: 60 New ATCs: కొత్తగా 60 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు

అక్టోబర్ 24వ తేదీ వరకు విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ కార్యాలయంలో హాజరై ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్‌ పొందవచ్చని సూచించారు. బాలికలకు యూనివర్సిటీలో హాస్టల్‌ వసతి కల్పిస్తున్నామని, అలాగే బాలురకు నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

కర్నూలు నగరంలోని నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు యూనివర్సిటీ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్లు : 8341511632, 9959758609 సంప్రదించవచ్చని వివరించారు.

#Tags