Self Assessment 1 Exams: 27 నుంచి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఆగ‌స్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 4 వరకు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ దేవరాజు వెల్లడించారు.

ఆగ‌స్టు 21న‌ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు గతంలో నిర్వహించే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్ష పేరును ప్రభుత్వం సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–1గా మార్పు చేసినట్లు చెప్పారు. ఈ పరీక్ష అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.

చదవండి: PhD Entrance Exam Ranker : పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ప్రథమ ర్యాంకు..

ఒకటి నుంచి 8వ తరగతి వరకు సీబీఏ–1 పరీక్షలు ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉదయం 10.45 నుంచి 11.45 గంటల వరకు, 6 నుంచి 8 వ తరగతి వారికి మధ్యాహ్నం 1.10 నుంచి 2.20 గంటల వరకు, 9,10 తరగతులకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని ఎంఈఓలు, డీవైఈఓలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

#Tags