Sainik School: ప్రశాంతంగా సైనిక్‌ స్కూల్‌ ప్రవేశపరీక్ష.. విద్యార్థుల హాజరు వివరాలు ఇలా

బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి మార్చి 10న‌ నిర్వహించిన పరీక్ష ఆదిలాబాద రీజియన్‌లో ప్రశాంతంగా జరిగింది.

843 మంది దరఖాస్తు చేసుకోగా 781 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 62 మంది గైర్హాజరయ్యారు. 92.65 శాతం నమోదైనట్లు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్‌ రీజియన్‌ కోఆర్డినేటర్‌ కొప్పుల స్వరూపారాణి ప్రకటించారు.

ఆదిలాబాద్‌ రీజియన్‌ వ్యాప్తంగా మూడుచోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో సీవోఈ బాలికల కళాశాల, ఆసిఫాబాద్‌లో బాలుర గురుకుల కళాశాల, బెల్లంపల్లిలో బాలుర గురుకుల సీవోఈ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

చదవండి: Sainik School: దేశంలోనే తొలి బాలికల సైనిక్‌ స్కూల్‌

విద్యార్థుల హాజరు వివరాలు

ఆదిలాబాద్‌లో ఆరోతరగతిలో 116 మందికి గానూ 108 మంది హాజరుకాగా ఎనిమిదిమంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌లో 114 మందికి గానూ 110 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఆసిఫాబాద్‌లో ఆరో తరగతిలో 95 మందికిగానూ 84 మంది హాజరుకాగా 11 మంది గైర్హాజరయ్యారు.

ఇంటర్లో 60 మందికి గానూ 48 మంది హాజరుకాగా 12 మంది గైర్హాజరయ్యారు. బెల్లంపల్లిలో ఆరోతరగతిలో 227 మందికిగానూ 215 మంది హాజరు కాగా 12 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌లో 231 మందికి గానూ 216 మంది హాజరుకాగా 15 మంది గైర్హాజరయ్యారు.
 

#Tags