5th Class Admissions: సైనిక పాఠశాలకు దరఖాస్తు చేసుకోండి

చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్‌ సాంఘిక, సంక్షేమ గురుకుల సైనిక శిక్షణ పాఠశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ కేసీ.రావు, ప్రిన్సిపాల్‌ కాళహస్తి కోరారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి సైనిక్‌ స్కూల్‌, రుక్మాపూర్‌, ఆరోతరగతి అనే ఆప్షన్‌ ఎంచుకోవాలన్నారు. 2014, ఏప్రిల్‌ 1 నుంచి 2016 మార్చి 31 మధ్య జన్మించినవారు అర్హులని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ లాగిన్‌లో రెండు లింకులు కనిపిస్తాయని, రెండో అప్లికేషన్‌ లింక్‌లో స్టేజి–1 ఆప్షన్‌ ఉంటుందని తెలిపారు. గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరానికి ఐదోతరగతిలో అడ్మిషన్‌ కోసం ప్రకటన వెలువడిందని పేర్కొన్నారు.

చదవండి: 6th and 9th Class Admissions : ఈ పాఠ‌శాల‌లో 6, 9వ త‌ర‌గ‌తి ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఎంపిక విధానం ఇదే..!

మోడల్‌ స్కూల్లో ప్రవేశాలు..

రుక్మాపూర్‌ మోడల్‌ స్కూల్లో ఆరో తరగతిలో 100 సీట్లు, ఏడు నుంచి పదోతరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడినట్లు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ తెలిపారు.

మండలంలో ఐదోతరగతి చదువుతున్న బాలికలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షకు ఓసీల కు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

 

#Tags