Higher Education: ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: చదువు పూర్తవగానే ఉపాధి దక్కేలా ఉన్నత విద్యలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మ మార్పులు తీసుకువచ్చిందని ఉన్నత విద్య శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

స్థానిక ఆర్ట్స్‌ కళాశాల రెండో గ్రాడ్యుయేషన్‌ వేడుకలు మార్చి 12న‌ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కమిషనర్‌ పోలా భాస్కర్‌ హాజరై మాట్లాడారు. విద్యార్థిని తరగతి గదికే పరిమితం చేయకుండా పరిశ్రమతో అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన జీవనోపాధి కల్పించేలా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

ఈ క్రమంలో మెరుగైన బోధన చేసేలా వివిధ అంశాలపై అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. చదువులో షార్ట్‌ కట్స్‌ పనికిరావన్నారు. కష్టపడితేనే లక్ష్యాలు నెరవేరతాయన్నారు. వైఫల్యాలకు ఇతరులను నిందించకుండా, పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు.

చదవండి: 10th Class Exam Answer Sheet: పాస్‌ చేయండి లేదంటే పెళ్లి చేస్తారు.. జవాబుపత్రంలో ఈ విద్యార్ధిని వేడుకోలు..

ఎస్కేయూ వీసీ డాక్టర్‌ హుస్సేన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మేధావులను తయారుచేసిన ఆర్ట్స్‌ కళాశాలలో చదువుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. క్రమశిక్షణ, సరైన వైఖరి, కష్టపడే తత్వం ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు. ప్రిన్సిపాల్‌ ఏసీఆర్‌ దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రోబోలుగా అభివృద్ధి చెందాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీలను కమిషనర్‌ పోలా భాస్కర్‌, వీసీ హుస్సేన్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఏజీఓ తులసి, ఆర్‌జేడీ నాగలింగారెడ్డి, ఎస్కే యూనివర్సిటీ సీఓఈ కృష్ణా నాయక్‌, సీఈ చలపతి, సీపీడీసీ సభ్యులు చంద్రశేఖర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags