Degree Results: రీ వాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల క్యాంపస్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని 2019 బ్యాచ్‌ పూర్వపు 3, 5 సెమిస్టర్ల రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ ఆగ‌స్టు 8న‌ తెలిపారు.

వర్సిటీ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. డిగ్రీ ఐదో సెమిస్టర్‌ 2020–21 బ్యాచ్‌ రీ వాల్యుయేషన్‌ ఫలితాలు కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు. వర్సిటీ పరిధిలోని పోస్టు గ్రాడ్యుయేషన్‌ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలను ఆగ‌స్టు 8న‌ విడుదల చేస్తామని డీన్‌ చెప్పారు.

చదవండి: AP Grama and Ward Sachivalayam Employees Reforms 2024 : కీలక‌ నిర్ణ‌యం.. ఏపీ గ్రామ‌/వార్డు సచివాల‌యాల్లో ఈ పోస్టులను రద్దు..! ఇంకా..

#Tags