Fees Reimbursement: ఫీజు బకాయిల విడుదలకు వినతి
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు మే 29న సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం సమర్పించారు.
చదవండి: Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మంజూరు
మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల నిధులు విడుదల చేయకపోవడంతో దాదాపు రూ.7వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని జాజుల కోరారు.
#Tags