Webinar: ‘మనూ’లో ఆన్‌లైన్ వెబినార్
రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఆన్‌లైన్ వెబినార్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ షాహిదాముర్తజా తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఐఎంసీ సెంటర్‌లో ‘రీ ప్రొడక్టివ్ చాయిస్ ఆఫ్ విమెన్ ఈజ్ ఈ ఫండమెంటల్ రైట్..ఈ డస్కోర్స్ ఫ్రమ్ జెండర్ లెన్స్’ అనే అంశంపై ఈ వెబినార్ సాగుతుంది. ఇందులో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు. కార్యక్రమంలో తరుణి, భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు మమతా రఘువీర్ ఆచంట, ప్రోవీసీ ప్రొఫెసర్ రహమతుల్లా, ఇన్‌చార్జి రిజి్రస్టార్ ప్రొఫెసర్ సిద్ధిఖీమహ్మద్ మహమూద్ పాల్గొంటారన్నారు.
Click here for more Education News
#Tags