New National Curriculum: ‘నూతన జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ భేష్‌’

సాక్షి, సిటీబ్యూరో: భారతీయ విద్యా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ ఈ మార్పునకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రముఖ బ్రిటిష్‌ రచయిత్రి, విద్యావేత్త క్లై హార్స్‌బర్గ్‌ అన్నారు.

ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌కు చెందిన కైలర్‌ ప్రస్తుతం భారత్‌లోని ప్రధానమైన 9 నగరాల్లో సరళంగా ఆంగ్ల భాషా బోధన అనే అంశంపై వర్క్‌ షాప్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె న‌వంబ‌ర్‌ 21న విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా నగరంలో ఉపాధ్యాయులకు వర్క్‌ షాప్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కైలర్‌ హార్స్‌బర్గ్‌ మాట్లాడుతూ., భారత్‌లోని ఉపాధ్యాయులకు వారి తరగతి గదులను ఆనందంగా, ఆకర్షణీయంగా మార్చడానికి వినూత్న పద్ధతులపై శిక్షణ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

చదవండి: English Medium : ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు

బాష ఒక విద్యావేత్త, రచయితగా అనేక అవకాశాలను అందిస్తుందని, సంస్కృతులను అనుసంధానం చేసే వేదికగానూ పనిచేస్తుందన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ వేదిక 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఉన్నత స్థాయి ఆలోచలను (హాట్స్‌) అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ వర్క్‌ షాప్‌లో భాగంగా నూతన ఆక్స్‌ ఫర్డ్‌ మోడ్రన్‌ ఇంగ్లిష్‌ 2025 ఎడిషన్‌ను ప్రారంభించారు.

ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఇండియా రీజినల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ సంత్యేంద్ర భదౌరియా మాట్లాడుతూ., 1478 నాటి అతిగొప్ప చరిత్రతో ‘ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఎడ్యుకేషనల్‌’ పబ్లిషింగ్‌లో గ్లోబల్‌ లీడర్‌గా పేరు.

#Tags