Andhra Pradesh: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఒకప్పుడు కార్పొరేట్ పాఠశాలల్లోనే ఇంటరాక్టివ్ ప్లాట్ (ఐఎఫ్‌పీ) విధానం ఉండేది. ఇప్పుడు ఆ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడగలదు. మరో ప్రధానమైన అంశం నాడు–నేడు కింద పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరాయి. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
– వెంకటయ్య, సైన్స్ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ హైస్కూల్, రాజంపేట
ఇంటికే చేరిన సర్టిఫికెట్లు
గతంలో సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత జగనన్న సురక్ష పథకం ద్వారా నాకు అవసరమైన కులం, ఆదాయం సర్టిఫికెట్లు మా ఇంటికే వచ్చాయి. జగనన్న అమలు పరుస్తున్న పథకాల వల్ల అందరికీ మంచి జరుగుతుంది.
– వంకర వెంకటమ్మ, చింతలచెలిక గ్రామం, చిట్వేలి మండలం
సొంతింటి కల సాకారం
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో సొంతింటి కల సాకారమైంది. నిరుపేదలమైన మాకు గతంలో ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఇల్లు మంజూరు కాలేదు. జగన్ పుణ్యమా అని ఈ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– రామక్క, రామానాయక్ తాండా, జాండ్ల, పీలేరు మండలం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధితో పాటు పేదలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మెరుగైన పాలన అందిస్తున్నారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని సర్టిఫికెట్లను క్షణాల్లో చేతికి అందిస్తున్నారని వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి నెట్‌వర్క్