ISRO Scientists: యడ్లపాడుకు ఇస్రో శాస్త్రవేత్తల రాక

యడ్లపాడు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు యడ్లపాడుకు రానున్నారు. రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు ఫిబ్ర‌వ‌రి 10,11వ తేదీల్లో నిర్వహించనున్నారు.

యడ్లపాడు గ్రామంలోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో ప్రారంభం కానున్న తొలిరోజు పోటీలకు శాస్త్రవేత్తలు పాల్గొననున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, పల్నాడు జిల్లా కార్యదర్శి దార్ల బుజ్జిబాబు తెలిపారు. అనంతరం జన విజ్ఞాన కళాయాత్ర కార్యక్రమంలో భాగంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండవీడుకోటను సందర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్రలో శాస్త్రవేత్తలతో పాటు పోటీల్లో పాల్గొనే విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

చదవండి: Vyommitra: అంత‌రిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమ‌మిత్ర‌’

సాయంత్రం చిలకలూరిపేట పట్టణంలోని సాధినేని చౌదరయ్య స్కూల్‌ ఆవరణలో ఇస్రో వారి బస్సు విజ్ఞాన యాత్ర కొనసాగుతుందన్నారు. కేవలం పోటీలకు వచ్చే విద్యార్థులే కాకుండా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం పాల్గొనవచ్చని తెలిపారు. విజ్ఞాన యాత్ర పూర్తిగా ఉచితమని వివరాలకు 92905 04570, 73829 73474 నంబర్లకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైఎస్‌ నాగేశ్వరరావు, చిలకలూరిపేట డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసరెడ్డి, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

#Tags