Osmania University: ఓయూలో హాస్టల్‌ ప్రవేశాలు ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ కాలేజీలతో పాటు నిజాం, సికింద్రాబాద్, సైఫాబాద్‌ కాలేజీల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం పీజీ విద్యార్థులకు (బాలురు, బాలికలు) హాస్టల్‌ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 10 వరకు హాస్టల్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ కొర్రెముల శ్రీనివాస్‌రావు అక్టోబర్ 1న‌ తెలిపారు.

చదవండి: DSC 2024 District Topper: ఎస్‌జీటీలో అరుణ్‌కుమార్‌ జిల్లా టాపర్‌

దరఖాస్తులను పరిశీలించి హాస్టల్‌ సీటు సాధించిన విద్యార్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత.. డిపాజిట్‌ చెల్లించి గదుల్లో చేరాలని స్పష్టం చేశారు. ద్వితీయ సంవత్సరం పీజీ కోర్సుల విద్యార్థులు అక్టోబర్ 3 నుంచి హాస్టల్‌ ప్రవేశాలను మెస్‌ బకాయిలు చెల్లించి రెన్యువల్‌ చేయించుకోవాలని తెలిపారు.

దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 16 నుంచి మెస్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags