గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

కొత్తకోట రూరల్‌: గురుకుల ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును 23వ తేదీ వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలుర (వీపనగండ్ల) ప్రిన్సిపాల్‌ ఎస్‌.దయాకర్‌ జ‌నవ‌రి 21న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 2023–24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు.

#Tags