Education Fee Concession: జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

జూన్ 27న‌ టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, బి.రాజశేఖర్, కార్యదర్శులు బి. జగదీశ్వ ర్, గండ్ర నవీన్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్‌ కుమార్, ఎం.రమేశ్, రామకృష్ణ తదితరులు సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిశారు.

చదవండి: Connect To Sakshi: సాక్షిఎడ్యుకేష‌న్‌తో షేర్‌ చేసుకోండి... క్యాంపస్‌ జర్నలిస్టులుగా ఎద‌గండి

రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారన్నారు.

జర్నలిస్టులకు తక్కువ జీతా లు ఉండటంతో ఆర్థిక సమస్యలతో జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని, గురుకులాల్లో ప్రత్యేక కోటా కింద ప్రవేశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయాలన్నారు.

#Tags