Face Recognition: హాస్టల్‌ విద్యార్థులకూ ఫేస్‌ రికగ్నిషన్‌!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్‌ రికగ్నిషన్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

దీన్లో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుకు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టనుంది వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆ వివరాలను ప్రభు­త్వానికి నివేదించారు.

ప్రభుత్వం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని సర్వీస్‌ ప్రొవైడర్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నట్లు  సమాచారం. ఎఫ్‌­ఆర్‌­ఎస్‌ అమలు కోసం ప్రత్యేకంగా రూ­పొం­దించిన యాప్‌ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్‌ సంక్షేమ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ)కి అప్పగించనున్నారు.

చదవండి: Lavudya Devi: డాక్టర్‌ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ

ఎంపిక చేసిన ప్రతి హాస్టల్‌కు చెందిన విద్యార్థుల ఫొటోలు తీసి, ఆథార్, ఫోన్‌ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేస్తారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

తద్వారా యాప్‌ ఉన్న మొబైల్‌ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది. ఇలా ఉదయం ప్రార్థన, సాయంత్రం స్కూల్‌ సమయం తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు సేకరిస్తారు. తద్వారా ఏఏ వసతి గృహాల్లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాజరు సంబంధ సమాచారంతోపాటు, హాస్టల్‌ సంక్షేమ అధికారుల అలసత్వాన్ని, నిర్వహణ లోపాలపై తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

#Tags