Exam Paper Leak: డిగ్రీ సెమిస్టర్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌..

రాయచోటి టౌన్‌: యోగివేమన విద్యాలయం పరిధిలోని రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్‌ పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. మంగళవారం సంస్కృత భాష పరీక్ష నిర్వహించాల్సి ఉంది.
Exam Paper Leak

ఈ క్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ హర్షలత ఫంకజ్‌ పనిమీద అనంతపురం జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. ఆమె మెయిల్‌కు వచ్చిన ప్రశ్నాపత్రాన్ని తాను సెలవులో ఉండటంతో తమ సిబ్బందితో కలిసి ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసింది. వాట్సాప్‌లో వచ్చిన పేపర్‌ను గ్రూప్‌లో ఉన్న ఒకరు బయటికి లీక్‌ చేయడంతో అది కాస్త చెక్కర్లు కొట్టి మీడియ వద్దకు చేరింది.

Job Opportunities In Abroad: విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ విషయం తెలియడంతో అప్రమత్తమైన ప్రిన్సిపల్‌ మరో పది..పదిహేను నిమిషాలలో డిలీట్‌ చేసింది. ఈ విషయమై ప్రిన్సిపల్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags