Employment: ఉద్యోగం, ఉపాధికి ఊతం

సంగారెడ్డి జోన్‌: పోటీ ప్రపంచంలో మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఐటీఐ కళాశాలల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముందుగా జిల్లాలోని రెండు కళాశాలలను ఎంపిక చేసింది. అన్ని వసతులు కల్పిస్తూ, పలు ప్రత్యేక కోర్సులలో శిక్షణ అందించనున్నారు.

విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీయల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను ఆధునీకరించి అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.

  • టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో కలిసి ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులకు పలు ప్రత్యేక కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి, హత్నూరలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
  • కోర్సులలో అడ్మిషన్‌ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అక్టోబర్ 31వ తేదీ వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు వెల్లడించారు.
  • ఏటీసీ కోర్సులలో శిక్షణతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసుకున్న వారు నైపుణ్యాన్ని బట్టి వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలు పొందేందుకు దోహదపడుతాయి.
  •  కోర్సులపై ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఎస్‌ఎస్‌సీ మెమో, టీసీ, కుల ధృవీకరణ పత్రం, బోనఫైడ్‌ ఆధారు కార్డులతో నేరుగా ఇంటర్‌ూయ్వకు హాజరు కావాలని కోరారు. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తరగతులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
  • శనివారం కలెక్టరు క్రాంతి అధికారులతో కలిసి ఆయా కళాశాలలను సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు. కేంద్రాల నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
  • ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సెంటర్లలో ఆరు కోర్సులపై శిక్షణ అందించనున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమెటీవ్‌ (ఒక సంవత్సరం శిక్షణ), ఇండస్ట్రీయల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నిషియన్స్‌ (ఒక సంవత్సరం శిక్షణ), ఆర్టిషియన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌ టూల్‌ (ఒక సంవత్సరం శిక్షణ), బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌–మెకానికల్‌ (రెండు సం.శిక్షణ), అడ్వాన్స్‌ సీఎన్‌సీ మెషినింగ్‌ టెక్నిషియన్‌ (రెండు సం.శిక్షణ), మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (రెండు సం.శిక్షణ) కోర్సులలో శిక్షణను అందిచనున్నారు.
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags