Medical College Scam: 3 ప్రైవేటు వైద్య కళాశాలలకు ఈడీ షాక్‌.. భారీగా ఆస్తులు అటాచ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది.

పీజీ మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ విషయంలో ఆయా కాలేజీలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందుకుగాను ఆ కాలేజీలకు చెందిన రూ. 9.71 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇందులో చల్మెడ కాలేజీవి రూ. 3.33 కోట్లు, ఎంఎన్‌ఆర్‌వి రూ. 2.01 కోట్లు, మల్లారెడ్డి కాలేజీ గతంలో లెక్కల్లో చూపని రూ. 1.475 కోట్లతోపాటు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కింద ఉన్న రూ. 2.89 కోట్లు ఉన్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఈ మేరకు ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం న‌వంబ‌ర్‌ 29న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపింది. 

చదవండి: Ramagiri Sheetal: ఎలాంటి కోచింగ్‌ లేకుండానే ప్రిపేర్‌ అయిన ‘శీతల్‌’.. బాలికల విద్యాసంస్థలో కొలువు..

ఇదీ కేసు నేపథ్యం..

పీజీ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను మెరిట్‌ ఆధారంగా కాకుండా ఎక్కువ ర్యాంకు ఉన్న వారికి దక్కేలా కాలేజీలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) వరంగల్‌లోని మట్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అనంతరం రంగంలోకి దిగిన ఈడీ విచారణ ప్రారంభించింది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మేనేజ్‌మెంట్‌ కోటా కింద కేటాయించిన పీజీ మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేయడం, మేనేజ్‌మెంట్‌ సీట్లలో ప్రవేశాల కోసం వర్సిటీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులకు సీట్లు దక్కేలా వ్యవహరించిన తీరును గుర్తించింది. ఈ తంతులో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతోపాటు కన్సల్టెంట్లు, మధ్యవర్తులు ఉన్నట్లు తేల్చింది. అత్యధిక ర్యాంకు ఉన్న విద్యార్థుల ధ్రుపవత్రాలను చూపుతూ సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడినట్లు ఈడీ విచారణలో వెలుగు చూసింది. 

చదవండి: DAO Provisional Selection List: డీఏఓ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితా విడుదల

నిర్దేశిత ఫీజుకన్నా 3 రెట్లకుపైగా వసూళ్లు.. 

బ్లాక్‌ చేసిన సీట్లను మాప్‌–అప్‌ రౌండ్‌/ఆఖరి దశ కౌన్సెలింగ్‌ వరకు అలాగే ఉంచి చివరి దశ కౌన్సెలింగ్‌ తర్వాత ఆయా విద్యార్థులు నిష్క్రమించినట్లు యాజమాన్యాలు చూపిస్తున్నాయి.

చివరి దశలో నిష్క్రమించినందుకు విశ్వవిద్యాలయం విధించిన పెనాల్టీని కళాశాల బ్యాంకు ఖాతాల ద్వారా లేదా మధ్యవర్తుల ద్వారా చెల్లిస్తున్నాయి. అలా ఖాళీ అయిన మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు నిర్దేశించిన మొత్తం కంటే 3 రెట్లకన్నా ఎక్కువ మొత్తంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో పెంచిన ఫీజుకు మించి క్యాపిటేషన్‌ ఫీజును ఎన్నో రెట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు తేల్చింది.

#Tags