Dummy Students: 29 స్కూళ్లలో డమ్మీ విద్యార్థులు ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి
ఆయా సీబీఎస్ఈ అఫిలియేటెడ్ పాఠశాలల్లో వాస్తవ విద్యార్థుల సంఖ్యకు మించి ఎన్ రోల్మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్గఢ్లోని మొత్తం 29 పాఠశాలల్లో ఇలాంటి దందా జరుగు తున్నట్లు తేల్చారు.
బాధిత పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మౌలిక సదు పాయాల లేమి వంటి ఇతర నిబంధనలు తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన ఈ పాఠ శాలల యాజమాన్యాలపై న్యాయపరంగానూ చర్యలు తీసుకోనున్నారు. బుధ, గురువారాల్లో 29 బృందాలు ఈ మేరకు తనిఖీలు చేపట్టాయని సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా చెప్పారు.
చదవండి: Class 10 and 12 Exams Guidance: 10, 12 తరగతుల.. వార్షిక పరీక్షలు.. బెస్ట్ స్కోర్ ఇలా!
అవకతవకలను గుర్తించిన స్కూళ్లలో దేశ రాజధాని ఢిల్లీలోనివే 18 కాగా, వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మ దాబాద్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్లో రెండేసి చొప్పున ఉన్నాయన్నారు. ఇంజినీ రింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రిపేరయ్యే విద్యార్థుల్లో కొందరు డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు పొంది, పరీక్షలకు సిద్ధమయ్యేందుకే పూర్తి సమయం కేటా యిస్తున్నారు.
తరగతులకు హాజరు కాకుండా వీరు నేరుగా బోర్డ్ పరీక్షలు రాసేలా ఆయా స్కూళ్లు వీరికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో మెడికల్ లేదా ఇంజినీరింగ్ సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుందో చూసుకుని మరీ సంబంధిత ప్రాంతాల్లోని డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు తీసుకుంటున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |