Schools: బడికి రావాలని ఒత్తిడి వద్దు: విద్యాశాఖ

విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ విద్యాశాఖ సెప్టెంబర్‌ 7న విడుదల చేసింది.
బడికి రావాలని ఒత్తిడి వద్దు: విద్యాశాఖ

హైకోర్టు పిల్‌ నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలను ఇందులో క్రోడీకరించింది. విద్యార్థులను స్కూళ్లకు రమ్మని ఒత్తిడి చేయొద్దని, విద్యాసంస్థల్లో భౌతిక దూరంతో పాటు కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాని పేర్కొంది. మధ్యాహ్న భోజన విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరిచింది. కరోనా లక్షణాలుంటే సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించింది. అలాగే ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం వేధించవద్దని స్పష్టంచేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సెప్టెంబర్‌ 7న ప్రభుత్వ స్కూళ్లలో 42.05 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో వర్షం వల్ల సెలవులు ప్రకటించినా.. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మాత్రమే స్కూళ్లు తెరవలేదని అధికారులు వెల్లడించారు.

#Tags