Delhi School Holidays extended : స్కూళ్లకు మరో ఐదు రోజులు సెలవులు

Delhi School Holidays extended

దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి పొగమంచు కమ్మేస్తోంది. దీనివల్ల విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని సర్వీసులను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

సెలవులు పొడిగింపు
ఈ క్రమంలోనే పాఠశాలలకు శీతాకాలపు సెలవులు ప్రకటించింది. ఇప్పుడు ఆ సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

మొదట ప్రకటించిన సెలవుల ప్రకారం.. ఈరోజు(సోమవారం)శీతాకాల సెలవులు ముగియాల్సి ఉంది. అయితే చలి తీవ్రత పెరగడంతో మరో అయిదు రోజుల సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అతిషి ఎక్స్‌లో తెలిపారు.

ఆ టైమింగ్స్‌లోనే తరగతులు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ  విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలుపుతూ విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలు–సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నడపాలని కోరింది.
 

#Tags