ఉచిత నర్సింగ్ శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

బీఎస్సీ నర్సింగ్, జీఎన్ ఎం కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత ఐఈఎల్‌టీఎస్, ఓఈటీ శిక్షణ, ఉచిత నైపుణ్య శిక్షణకు సెప్టెంబర్‌ 28న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ‘తెలంగాణ నర్సింగ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఫర్‌ నర్సెస్‌’ కోఆర్డినేటర్‌ సునీత ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచిత నర్సింగ్‌ శిక్షణకు స్పాట్‌ అడ్మిషన్లు

నర్సింగ్ విద్యను పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు విదేశాలకు వెళ్లేందుకు రాసే ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్టీఎస్), ఆక్యుపేషనల్ ఇంగ్లిష్ టెస్ట్ (ఓఈటీ) పరీక్షలకు 6 నెలలపాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. మంగళవారం నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యరి్థనులు 4 పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్, జీఎన్ ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, కుల, ఆదాయ ఒరిజినల్ సరి్టఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని అన్నారు. బాటా షోరూం కాంప్లెక్స్, 4వ అంతస్తు, పనామా, వనస్థలిపురం, హైదరాబాద్ చిరునామాలో ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. వివరాలకు 6309164343, 98480 47327 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చదవండి: 

IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 513 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు; ఎవరు అర్హులంటే...

తెలంగాణలో కొత్తగా 7 మెడికల్, 13 నర్సింగ్‌ కాలేజీలు..!

#Tags