Online Course on AI: మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ కోసం కృత్రిమ మేధ కోర్సు

రాయదుర్గం (హైదరాబాద్‌): వైద్య నిపుణుల కోసం కృత్రిమ మేధపై ప్రత్యేక ఆన్‌లైన్‌ కోర్సుకు హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ శ్రీకారం చుట్టింది.

ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఏఎంఎస్‌)’సహకారంతో ఈ కోర్సును నిర్వహించనున్నారు. 12 వారాల పాటు ఉండే ఈ ఆన్‌లైన్‌ కోర్సులో.. వివిధ ఆరోగ్య సమస్యలు, లక్షణాలను కచ్చితంగా నిర్ధారించడంలో, తగిన చికిత్స అందించడంలో కృత్రిమ మేధను వినియోగించే నైపుణ్యాలను బోధిస్తారు.

చదవండి: Srikushal Yarlagadda: భవిష్యత్తును చెప్పే డెస్టినీ.. ఏఐ యాప్‌ రూపకల్పనలో హైదరాబాదీ.. తల్లి భవితపై ప్రయోగాలు

రోగుల సంరక్షణకు సంబంధించి మెరుగైన పద్ధతులను అనుసరించే సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా వీడియో పాఠాలు, సంప్రదింపుల సెషన్లు, కేస్‌ స్టడీస్, క్విజ్‌లు, అసైన్‌మెంట్లు, అసెస్‌మెంట్లు ఉంటాయని.. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ అందజేస్తారు. 

#Tags