ISO Certification: ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఐఎస్‌ఓ గుర్తింపు

సాక్షి, అమరావతి: ఆంధ్ర­ప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యా­భి­వృద్ధి సంస్థ (ఏపీఎస్‌­ఎస్‌డీసీ), క్వాలిటీ మేనే­జ్‌­మెంట్‌ సిస్టం విభాగంలో ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎస్‌ఓ) 9001 2015 సర్టిఫికెట్‌ దక్కించుకోవడం ఆనందంగా ఉందని సంస్థ ఎండీ, సీఈఓ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు.

ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ రావడం సంస్థకు గర్వకారణమని,  ఈ ఘనత సాధించేందుకు కారణమైన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లి­లోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్, ఎండీ, సీఈవో డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ కలిసి ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికెట్‌ అందుకున్నారు.

చదవండి: Special Story: అతిగా దాచుకోవడం కూడా జబ్బే.. అని మీకు తెలుసా!?

అనంతరం  సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్‌ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సర్టిఫికెట్‌ మరింత బాధ్యత పెంచిందనీ, దాన్ని నిలబెట్టుకునేందుకు మరింత బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సర్టిఫికేషన్‌ను హైదరాబా­ద్‌కు చెందిన గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అందించింది.

#Tags