Anganwadi Workers Retirement Benefits: రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం అంగన్‌వాడీల ధర్నా

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయం ఎదుట వందలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా చేపట్టారు.

అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెన్షన్‌ పెంచుతూ వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఆయాలకు పాత పద్ధతిలోనే పదోన్నతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వరద గాలన్న, పట్టణ కార్యదర్శి రాజ్‌కుమార్‌ తదితరులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కలతో చర్చలు నిర్వహిస్తామన్నారు.

యూనియన్‌గా కూడా వస్తే ప్రభుత్వాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యమ్మ, టీచర్లు గౌసియాబేగం, కృష్ణవేణి, జ్యోతి, మంజుల, అనురాధ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Swecha: మన భాషలో స్వేచ్ఛగా.. తెలుగు ఏఐ చాట్‌బోట్‌ రూపకల్పనకు ప్రణాళికలు

46 మంది అంగన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు

దేవరకద్ర పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా.. అమ్మ మాట– అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించకుండా ధర్నాలో పాల్గొన్నారని సీడీపీఓ శైలశ్రీ అన్నారు. ఈ మేరకు వారికి సోమవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

మొత్తం 46 మంది విధులకు డుమ్మా కొట్టి సీఐటీయూ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నట్లు సూపర్‌వైజర్లు గుర్తించారని తెలిపారు. వారంతా షోకాజ్‌ నోటీసు అందుకున్న 24 గంటలలోపు తమకు వివరణ ఇవ్వాలని సూచించారు. లేనిపక్షంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.

చదవండి: Telangana Engineering Colleges Fees 2025-26 : వచ్చే ఏడాది నుంచి కొత్త‌ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖారారు..!

#Tags