UGC గుర్తింపు లేకున్నా మహిళా వర్సిటీలో ప్రవేశాలు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లేకున్నా వరుసగా మూడో సంవత్సరం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు.

పర్మినెంట్‌ వీసీ లేనందున, రాష్ట్ర ఉన్నత విద్యామండలితో పాటు విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుర్తింపు లభించలేదు.

యూజీసీ గుర్తింపు లేనందున మహిళ వర్సిటీల్లో చదువులు పూర్తి చేసుకొని బయటకు వచ్చిన విద్యార్థులకు ఇంత వరకు డిగ్రీ సర్టిఫికెట్లను జారీచేయలేదు. సకాలంలో సర్టిఫికెట్లు అందకపోవడంతో పైచదవులకు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు.

చదవండి: BSc Food Sciences: సబ్జెక్టు టాపర్‌గా ఐశ్వర్య

డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో సమయం వృథా అవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఏటా 5 వేల మంది విద్యార్థినులు మహిళా వర్సిటీలో ప్రవేశం పొందుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయనందునే యూజీసీ గుర్తింపు రాలేదని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. 

#Tags