UPSC IFS 2023 Topper Ritvika Pandey : ఫెయిల్ అయ్యా.. కానీ ఐఎఫ్ఎస్‌లో ఫస్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఆ కోరికతోనే..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఐఎఫ్ఎస్(IFS) తుది ఫలితాల్లో జాతీయ స్థాయిలో నెం-1 ర్యాంక్ సాధించింది.. జార్ఖండ్‌కు చెందిన రిత్విక.

తొలి ప్రయత్నంలోనే ఫెయిలైనా ఆమె ధైర్యం కోల్పోకుండా కష్టపడి చ‌దివి.. రెండో ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో UPSC IFS 2023 టాప్ ర్యాంక‌ర్ రిత్విక స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఆ కోరికతోనే..

ఐఎఫ్ఎస్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం సులువైన విషయం కాదు. తన ప్రతిభతో రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్ సాధించి రిత్విక ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ఈమె కేవ‌లం 26 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఈ ఘ‌న‌త సాధించారు. ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జార్ఖండ్ లో జన్మించిన రిత్విక ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బాల్యం నుంచి రిత్వికకు జంతువులపై ప్రేమ ఉండేది. కాలేజ్‌లో వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తి ఆమె కెరీర్ ను మార్చేసింది. సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై పని చేయాలనే కోరికతోనే ఆమె అటవీ సంరక్షణ రంగంలో అడుగు పెట్టారు. భూగర్భ శాస్త్రం, అటవీ శాస్త్రం ఎంచుకున్న రిత్విక అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడ్డారు.

☛ UPSC IFS Final Results 2023 : ఐఎఫ్‌ఎస్ ఫైన‌ల్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈ సారి టాప్ 10 ర్యాంక‌ర్లు వీళ్లే.. కానీ..

ఫెయిల్యూర్స్ నుంచి..

తల్లి సపోర్ట్ చేయడంతో ఫెయిల్యూర్స్ గుర్తించి ఆమె పాఠాలు నేర్చుకున్నారు. రెండోసారి మరింత పట్టుదలతో చదివిన రిత్విక టైమ్ టేబుల్ ను ప్రిపేర్ చేసుకుని సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకున్నారు. సిలబస్, పాత పరీక్ష పత్రాలను సైతం అధ్యయనం చేసిన రిత్విక ప్రిపరేషన్ మధ్య విరామాలు, డెడ్ లైన్స్ ను పాటించారు. 

వీరి వ‌ళ్లే..
తల్లీదండ్రులు, స్నేహితుల సహకారం వల్లే పరీక్షలలో సత్తా చాటడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. నా సక్సెస్ తల్లీదండ్రులను సైతం గర్వపడేలా చేసిందని రిత్విక చెప్పారు. రిత్విక టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు. రిత్విక చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రిత్విక సక్సెస్ స్టోరీ నేటితరం యువతకు.. అలాగే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ లాంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే చాలామందికి స్ఫూర్తి  నింపుతుందని చెప్పడంలో సందేహం లేదు.

#Tags