UPSC Civils Ranker Success Story : ఓట‌మి ఎదురైన‌.. నా ప్రిప‌రేష‌న్‌ ప్ర‌యత్నం మాత్రం అప‌లేదు.. చివ‌రికి సివిల్స్ కొట్టానిలా..

మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డంలో.. ఎన్నో ఇబ్బందులు.. ఆటంకాలు ఎదురుర‌వుతుంటాయి. కానీ ఇబ్బందులు.. ఆటంకాలు వ‌చ్చాయ‌ని మ‌నం మ‌నం ప్ర‌య‌త్నం ఆపితే.. మ‌న ల‌క్ష్య‌నికి విలువ ఉండ‌దు. కానీ ఈ సివిల్స్ ర్యాంక‌ర్ మాత్రం.. మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Naupada Ashrita UPSC Ranker Success Story

అయినా ప్రయత్నం ఆపలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. అదే విశ్వాసంతో, సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నంలో విజ‌యం సాధించి.. సివిల్స్‌లో 315 ర్యాంకు సాధించింది. ఆమె మరెవరో కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖప‌ట్నం నగరానికి చెందిన నౌపడ ఆశ్రిత. ఈ నేప‌థ్యంలో.. నౌపడ ఆశ్రిత స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
ఆశ్రిత.. విశాఖపట్నంలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జ‌న్మించారు. తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లి గృహిణి.

☛ UPSC Civils Ranker Success Story : ఈ జంట సాధించిన విజ‌యంతో వారి ఇంట వేడుక‌లు రెట్టింపు..

ఎడ్యుకేష‌న్ : 
ఆశ్రిత.. ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని రైల్వేన్యూకాలనీలో ఉన్న హరగోపాల్‌ స్కూల్లో జరిగింది. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ చదివింది. తరువాత ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. 

ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే..

ఆశ్రిత.. 2019లో ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరింది. ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నపుడే సోషల్‌ వర్క్‌ పట్ల ఆసక్తి పెరిగింది. సివిల్స్‌ కోచింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లా. కోవిడ్‌ కారణంగా కోచింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నా. ఇంటి దగ్గరే చదివి, రెండు సార్లు సివిల్స్‌ రాశాను. కానీ ప్రిలిమ్స్‌ కూడా అర్హత సాధించలేకపోయా. ఈసారి పట్టుదల పెరిగింది. మరోసారి రాసేందుకు కోచింగ్‌ తీసుకున్నా.

నా ల‌క్ష్యం ఇదే..
2022లో సివిల్స్‌ మూడో అటెంప్ట్‌ చేశా. ఇటీవ‌ల‌ విడుదలైన ఫలితాల్లో 315వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుకు జనరల్‌ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు. అందుకే మరోసారి ర్యాంకు మెరుగుగైన ర్యాంకు కోసం 28న జరిగే ప్రిలిమ్స్‌కు హాజరుకానున్నట్టు ఆశ్రిత పేర్కొంది. తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లి గృహిణి. తల్లితండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళిక, అధ్యాపకులు శిక్షణ తననీ స్థాయికి తీసుకొచ్చాయన్నారు.

☛ Young IAS Success Story: తొలి ప్ర‌య‌త్నంలోనే ఐఏఎస్ కు ఎంపికైన 22ఏళ్ళ యువ‌కుడు....కార‌ణం?

#Tags