Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో.. ఓ అనుకోని కుదుపుతో అకస్మాత్తుగా పెరాలసిస్‌ స్ట్రోక్‌ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్‌ ఛైర్‌కే పరిమితమైంది ఈమె

కానీ కాలం కాళ్లు కదలలేని స్థితిలో పడేస్తే.. ఆమె సంకల్పం ఆమెను యూపీఎస్సీ సివిల్స్ 2023లో విజ‌యం సాధించి.. ఉన్న‌త స్థాయిలో నిలబెట్టింది. నేడు ఎంతో మంది యువ‌త‌కు స్ఫూర్తినింపింది. ఈమే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్‌ నగర పరిధిలో కిర్లంపూడి లేఅవుట్‌ ప్రాంతానికి చెందిన వేములపాటి హనిత. ఈ నేప‌థ్యంలో సివిల్స్ ర్యాంక‌ర్ వేములపాటి హనిత స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేస‌థ్యం :
వేములపాటి హనిత.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్‌కు చెందిన వారు. అమ్మ ఇందిర. ఈమె ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. నాన్న వేములపాటి రాఘవేంద్రరావు. ఈయ‌న‌ ఇండియన్‌ రైల్వేలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌.

చదువుల్లో కూడా ఆటంకాలే..
హనిత చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా చురుకు. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు టింపనీలో సాగింది. ఇంటర్మీడియట్‌ ఫిడ్జ్‌లో పూర్తిచేశారు. ఇంటర్మీడియట్‌ వరకు వైజాగ్‌లోనే చదివింది. 2012లో జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ సీటు సాధించింది. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో అనుకోని ఓ కుదుపు. అకస్మాత్తుగా పెరాలసిస్‌ స్ట్రోక్‌ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్‌ ఛైర్‌కే పరిమితమైంది. దీంతో ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటు వచ్చినప్పటికీ.. ఇంజనీరింగ్‌ విద్యను వదులుకోవాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో రెండేళ్లు మానసికంగా కుంగిపోయింది. కానీ తల్లిదండ్రులు, సన్నిహితుల ప్రోత్సాహంతో దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసింది. 

 IAS Officer Success Story : ఈ మైండ్ సెట్‌తోనే.. ఐఏఎస్‌.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

అత్యంత అరుదుగా కనిపించే..
2013లో అత్యంత అరుదుగా కనిపించే వెన్నముక ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారు. ఆ ఇన్‌ఫెక్షన్‌ వల్ల నాలుగు గంటల్లోనే పెరాలసిస్‌ వచ్చింది. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అనేక ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రెండేళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు సహకారం, గురువు రామదూతస్వామి ప్రోత్సాహం, ఆశీస్సులతో మళ్లీ సాధారణ స్థితికి రాగలిగారు. ఇంటికే పరిమితమైనప్పటికీ హనిత చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ఎక్క‌డ కూడా నిరాశ‌ చెందక కుండా.. చదువుపై ఆసక్తిని చంపుకోలేక.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురించి ముందుకు సాగింది. 

సివిల్స్‌కు నా ప్రిప‌రేష‌న్ ఇలా ఉండేది..
సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఇంట్లోనే ప్రిపేరయ్యారు. అలాగే మెటీరియల్‌ సొంతంగా తయారు చేసుకున్నారు.  సివిల్స్‌ మెయిన్స్‌కు మాత్రం సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీతో పాటు పలుచోట్ల తీసుకున్న శిక్షణతో పాటు గైడెన్స్ తీసుకున్నారు. మొదట్లో ప్రతిరోజూ ఎనిమిది గంటలు చదవడానికి కేటాయించేవారు. ఆ తరువాత క్రమంగా ఆరు గంటలు సమయాన్ని కేటాయించింది. గైడెన్స్‌ లేకపోవడంతో తొలి మూడు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. మూడుసార్లు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకుని నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. 

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

గత ఏడాది గ్రూప్‌-1 కూడా..

సివిల్స్‌ దిశగా ప్రయాణం ప్రారంభించి.. 2020లో తొలిసారిగా యూపీఎస్సీ సివిల్స్‌కు మొద‌టి ప్ర‌య‌త్నం చేశారు. వ‌రుస‌గా మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేశా. మెయిన్స్‌లో విఫలమైంది. ఎట్ట‌కేల‌కు నాలుగో ప్రయత్నంలో మెయిన్స్‌, ఇంటర్వ్యూ క్లియర్‌ చేయడంతో పాటు మంచి ర్యాంకు సాధించారు. అలాగే గత ఏడాది గ్రూప్‌-1 కూడా అటెమ్ట్‌ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో ఏవో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమె నగర పరిధిలోని మానసిక ఆస్పత్రిలో అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తుండగానే సివిల్స్‌ ర్యాంకు వచ్చింది.

 IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

డిగ్రీ తర్వాత అక్కడితోనే తన జీవితం అయిపోకూడదని భావించి.. సివిల్స్‌పై ఫోకస్‌ చేసింది. 2019 నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ కావడం మొదలుపెట్టింది. 2023 సివిల్స్ ఫ‌లితాల్లో జాతీయ స్థాయిలో 887వ ర్యాంకు సాధించింది. 

ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశకు గురికావద్దు..

సివిల్స్‌లో ర్యాంకు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని హనిత తెలిపింది. తనలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్‌ వాళ్లు ఎక్కడా కుంగిపోకుండా.. ధైర్యంతో ముందుకెళ్తే ఇలాంటి విజయాలు ఎన్నో సాధించవచ్చని తెలిపింది.
ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశకు గురికావద్దు. చీకటి వెంటే వెలుగు ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. దీనికి నేనే ఒక ఉదాహరణ. ఇక జీవితం లేదు అనుకుని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన నేను.. మళ్లీ ఈరోజు గెలుపుబాట పట్టాను. 

నిరాశకు లోనైన ప్రతి ఒక్కరూ ఆశతో రేపటి కోసం చూడాలి. మంచి రోజులు తప్పక వస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు అంకిత భావంతో కృషిచేయాలి. అప్పుడే గెలుపుబాట పడతాం. మనమేంటో నిరూపించుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. రెండేళ్లపాటు నేను నరకాన్ని అనుభవించాను.

☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

అప్పటివరకు ఆనందంగా సాగిపోయిన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తల్లిదండ్రులు కూడా తీవ్రంగా వేదన అనుభవించారు. కానీ, నేను బాధపడకూడదని వాటిని బయటపడనీయలేదు. ఈ జర్నీలో అమ్మా, నాన్న ప్రోత్సాహం వారి సహకారం మరువలేనిది. నేటి యువ‌త‌కు ఈమె జీవితం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

#Tags