Inspiring Story : ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. ఐఎఫ్ఎస్‌ (IFS) ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించానిలా.. ఫస్ట్ అటెమ్ట్‌లోనే

సాధించాల‌నే పట్టుదల ఉంటే చాలు.. ఎంతటి లక్ష్యాన్నైనా సుల‌భంగా ఛేదించవచ్చు అని ఎంతోమంది నిరూపించారు.

సాధారణ కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగి తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారు. కలలను సాకారం చేసుకునే ప్రయాణంలోఎదురైన అవమానాలను జీవిత పాఠాలుగా భావించి ముందడుగు వేశారు.

Inspiring Success Story: ఆ రైతు ఇంట‌ ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అందరూ కలెక్టర్లే.. కానీ..

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్‌) ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఇదే కేటగిరీకి చెందుతారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. ఒకప్పుడు ఇంగ్లీష్‌ అంటే భయపడి అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కష్టపడితే అనుకున్నది సాధించగలడని మాటల్లో చెప్పడమే కాదు.., చేతల్లో చేసి చూపించాడు కూడా. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్న పర్వీన్.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో ఎక్కువ కటాఫ్ ఉన్న ఐఎఫ్ఎస్ (IFS) అధికారిగా మారారు. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం..

Government Jobs Family: వీరి ఇంట అందరికి ప్రభుత్వ కొలువులే..!

కుటుంబ నేప‌థ్యం :
ఈయ‌న‌ రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్ జిల్లా మిర్జావాలి మీర్ గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లికి 13 ఏళ్లకే పెళ్లి జరిగింది. 16 ఏళ్లకే పర్వీన్ పుట్టాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో, అతడిని చదివించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు.

ఇంగ్లీష్ రాక పోవ‌డంతో..

చిన్న నాటి నుంచి హిందీ భాషలో చదువుకున్న పర్వీన్ కస్వాన్‌ కాలేజీ చదువుల్లో భాష విషయంలో ఇబ్బందులు పడ్డారు. కాలేజీలో ఎక్కువ మంది ఇంగ్లీష్‌‌లోనే మాట్లాడేవారని.., తనకు అసలు అర్థమయ్యేది కాదని, ఆ తర్వాత ఇంగ్లీష్‌‌లో పట్టు సాధించగలిగానని పర్వీన్ తెలిపారు. ఏరోస్పేస్‌పై ఆసక్తితో అందులో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ తీసుకున్న పర్వీన్.. గేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి బెంగళూరు ఐఐఎస్‌సీలో మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ డిజైన్ చేశారు. ఆ తర్వాత 2015లో యూపీఎస్‌సీ ఎగ్జామ్‌ రాసి 81వ ర్యాంకు సాధించారు.

UPSC Civils Results 2022: ప‌రీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..

ఎక్కువ కటాఫ్..

మిగతా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులతో పోలిస్తే ఐఎఫ్ఎస్(IFS)కు ఎక్కువ కటాఫ్ ఉంటుంది. అయినా ఆ కటాఫ్ క్లియర్ చేసి పర్వీన్ కస్వాన్‌ ఐఎఫ్ఎస్ అధికారి అయ్యారు. అయితే, అందుకు పర్వీన్ చాలా కష్టపడ్డారు. ఐఎఫ్ఎస్ అధికారి అయ్యాక ఆయన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఒకప్పుడు ఇంగ్లీష్‌ రాక ఇబ్బందులు పడ్డ ఆయన ఇప్పుడు ఇంగ్లీష్‌ భాషలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నా ప్రిపరేషన్ ప్లాన్ ఇదే.. ఫస్ట్ అటెమ్ట్‌లోనే సక్సెస్ అయ్యానిలా..

తన లక్ష్యం అయిన ఐఎఫ్ఎస్ సాధించడం కోసం చాలా కష్టపడినట్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు పర్వీన్. ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) బుక్స్‌తో పాటు న్యూస్ పేపర్స్ చదివానని, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేశానని వివరించారు. ఫలితంగా ఫస్ట్ అటెమ్ట్‌లోనే సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు.

UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

#Tags