UPSC Civils Free Coaching: ఉచితంగా సివిల్స్‌లో శిక్షణ,తరగతులు ఎప్పటి నుంచంటే..

మంచిర్యాలటౌన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు సివిల్‌ సర్వీసెస్‌ లాంగ్‌ టర్మ్‌–2025(ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌) ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి బి.వినోద్‌కుమార్‌, బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకులు జి.ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Department of Education: టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ముందుకే

జూలై 18 నుంచి ఏప్రిల్‌ 18, 2025 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, జూలై 3లోగా హైదరాబాద్‌లోని సైదాబాద్‌, లక్ష్మీనగర్‌ కాలనీలో టీజీబీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి 100 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. వివరాలకు 08732–221280 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

#Tags