Free Long Term Coaching: సివిల్‌ సర్వీస్‌లో ఉచిత లాంగ్‌టర్మ్‌ శిక్షణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీస్‌–2025లో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఉచిత లాంగ్‌ టర్మ్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమాధికారి ఇందిర, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ స్వప్న జూన్ 19న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి జిల్లాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలన్నారు.

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ నెల నుంచి తమ పేర్లను www.tsbcstudycircle.cgg.gov.in సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ నం.08542– 293790ను సంప్రదించాలని కోరారు.
 

#Tags