Free Civils Coaching: సివిల్‌ సర్వీసెస్‌ లాంగ్‌టర్మ్‌ ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణకు నేడే ఆఖరు

ఆదిలాబాద్‌ రూరల్‌: సివిల్‌ సర్వీసెస్‌ లాంగ్‌టర్మ్‌ 2025 (ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌) పరీక్ష కోసం అందించనున్న ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ గడువు జూలై 3‌తో ముగియనుందని జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ జూలై 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ పాసై ఆసక్తి కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి జూలై 7న ఆన్‌లైన్‌ ద్వారా స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

అర్హత సాధించిన వారికి ఈ నెల 18 నుంచి శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 08732–221280 నంబరులో సంప్రదించాలని సూచించారు.

#Tags