Amrapali IAS Real Story : ఆమ్రపాలి.. ఈమె సక్సెస్ సీక్రెట్ ఇదే.. కుటుంబ నేపథ్యం మాత్రం..
స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఐఏఎస్‌ల అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆమ్రపాలి HMDA కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో మహిళా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సక్సెస్ జర్నీ.. కుటుంబ నేపథ్యం మీకోసం..
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన ఆడపడుచు, ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి. ఈమె ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. అపాయింట్‌మెంట్ ఆఫ్ కేబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసిన విషయం తెల్సిందే.
కుటుంబ నేపథ్యం :
ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.
అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో..
ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్రపాలి.. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది.
ఈమె కుటుంబం అంతా..
ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో..
సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కేరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాఇష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అందులో బెస్ట్‌గా ఉండేదాన్ని సాధించాలనే గోల్ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉన్నారు. నువ్వు అమ్మాయివి ఇలాంటి చదువే నీకు కరెక్ట్ అనలేదు.
అందరికీ నచ్చాలంటే ఎలా..?
సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం నేర్పుతుంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్థుకుపోవడం వంటివి వంటబట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. అణుకువగా ఉండాలి అంటే. బీ కూల్, బీ నైస్ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్‌గా ఉండు, నువ్వు ఏం చేసినా ఏం కాదు.. భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకం (కండీషనింగ్)లోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవ్వరూ బతకలేరు.
అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మంచిగా బతకడం ముఖ్యం, ఆ తర్వాత పక్కన వాళ్లు. లీగల్, సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలు ఉన్న పద్ధతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది.
ఇక్కడ చాలా బెటరే...కానీ
అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలో ఉంది. పాలన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడా ను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ మాటలను బట్టి.. ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా.. వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి.. ఎంత మందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను.
మన రాష్ట్రంలో కలెక్టర్‌గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు షీ టీమ్స్ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలను వేధించే, టీజ్ చేసే వాళ్లు అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్‌లతో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం.
ప్రభుత్వ ఉద్యోగమే..
మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్ రంగంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల/ కాలేజీల్లో ఉన్న పిల్లలు హై స్పీడ్ ట్రాక్‌లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది. గతంలో టెన్త్‌తో చదువు ఆపేసే వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్‌కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. నైన్త్, టెన్త్‌లో చదువు ఆపేసిన వారు, అన్ స్కిల్ల్‌డ్ గల్స్ కోసం వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి.
బాధలు ఉంటే..
ర్యాగింగ్ చేసినా, టీజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడుతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టు పక్కల అంతా చెడుగా అనుకుంటారెమో అని పెళ్ళైన వాళ్లు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావ్, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, అలా ఎందుకు మాట్లాడవు... తప్పంతా నీదే అంటూ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవిన్యూ వాళ్లకి చెప్పండి.. మేము చూసుకుంటాం.
గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసి పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు. అండర్ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి. గంటా, రెండు గంటలా అనేది కాదు. పార్ట్‌టైం జాబ్, క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. మనం అవునన్నా.. కాదన్నా వరల్డ్ రన్స్ ఆన్ ఎకనామికల్. హౌజ్ వైఫ్‌గా ఉండటం తప్పు కాదు. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్లు, సృజనాత్మకత ఉన్న వారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉమన్ గో అవుట్ అండ్ వర్క్... దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.
నా విషయంలో..
నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడులు లేవు. అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు ఛాయిస్ ఉండడం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీరు అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్స్ సెలక్ట్ చేసుకోమంటారు. మెకానికల్, సివిల్స్ వద్దంటారు. అమ్మాయిల తెలివి తేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
ఇది అందరం బాధపడే విషయం..
మగ పిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం, టెర్రిబుల్ ట్రాజిక్. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్దతిలో మార్పు రావాలి.
తిరిగి తెలంగాణలోకి ఎంట్రీ..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్‌పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది.
➤ TSPSC Reforms 2023 : మొత్తానికి TSPSC ప్రక్షాళన.. ఎలా అంటే..?
మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో..
ఆమ్రపాలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం.
యూపీఎస్సీ సివిల్స్‌లో.. జాతీయ స్థాయిలో..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
ఆమ్రపాలి తండ్రి..
ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్‌ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది.
ఆమ్రపాలి సోదరి మాత్రం..
ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్‌ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్‌ఎస్‌లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
అమ్రపాలి భర్త కూడా..
అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీగా పనిచేస్తున్నాడు