Btech Jobs 2023 : బీటెక్ పూర్తి చేశారా.. అయితే నెలకు రూ.2 లక్షల వరకు జీతం వ‌చ్చే ఉద్యోగాలు ఇవే..!

వివిధ‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నేషనల్ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (NTPC) నోటిఫికేష‌ను విడుద‌ల చేసింది.
NTPC Jobs 2023

నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మినెంట్ బేసెస్‌లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

☛ BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.. నెలకు రూ.43,550 జీతం..

భర్తీ చేయనున్న పోస్టులు వివ‌రాలు ఇవే..

➤ మొత్తం 66 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.
➤ వీటిలో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో 12, మెకానికల్‌లో 30, కన్‌స్ట్రక్షన్.. సివిల్‌ విభాగంలో 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హ‌త‌లు ఇవే..
☛ అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ☛ సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వ‌యోప‌రిమ‌తి:
అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

చ‌ద‌వండి: NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో 56 ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ద‌ర‌ఖాస్తు విధానం : 
అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం : 
స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేత‌నం :
ఉద్యోగానికి ఎంపికైన నెల‌కు జీతంగా రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు చివ‌రి తేదీ : ఏప్రిల్ 21, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://www.ntpc.co.in/

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

☛ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
☛ రైల్వే జాబ్స్
☛ మెడికల్ జాబ్స్
☛ బ్యాంక్ జాబ్స్
☛ ఇంజనీరింగ్ జాబ్స్
☛ ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
☛ డిఫెన్స్‌ జాబ్స్

#Tags