Indian Navy Officer Recruitment 2024: నావికా దళంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే..

కర్నూలు(హాస్పిటల్‌): భారత నావికా దళంలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈవో పీవీ రమణ మార్చి 4న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

భారత నావికా దళంలో 254 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైందని, ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించాలన్నారు.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో మెకానికల్‌/ఎలక్ట్రికల్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ ఉత్తీర్ణత లేదా 60 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఆపరేషనల్‌ రీసెర్చ్‌ స్పెషలైజేషన్‌తో ఎంఎస్‌సీ ఉత్తర్ణత కలిగి ఉండాలన్నారు. లాజిస్టిక్‌ విభాగంలోని పోస్టులకు ఎంబీఏ/ఎంసీఏ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.

చదవండి: AAI Recruitment 2024: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 490 పోస్టులు... భారీగా జీతం.. ఎంతంటే..!

అభ్యర్థుల వయస్సు 19 నుంచి 24 సంవత్సరాల 6 నెలల లోపు ఉండాలని, ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌లోని పైలెట్‌ పోస్టులకు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల 6 నెలలోపు ఉండి కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు.

కనీస ఎత్తు పురుషులైతే 157 సెంటిమీటర్లు, మహిళలకు 152 సెంటిమీటర్లు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలన్నారు. సంబంధిత విద్యార్హత మెరిట్‌, నిర్దేశిత శారీరక ఆరోగ్య ప్రామాణి క అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చే సి ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాల కోసం https:// www. joinindiannavy. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

#Tags