‘Agnipath’ను యువత వినియోగించుకోవాలి

కాగజ్‌నగర్‌ రూరల్‌: అగ్నిపథ్‌ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఆర్మీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శివ అన్నారు.

పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జూలై 30న‌ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రక్షణ రంగా నికి పెద్దపీట వేసిందన్నారు. యువతను దేశ భక్తులుగా, సైనికులుగా మార్చాలనే ఉద్దేశంతో అగ్నిపథ్‌ స్కీంను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

చదవండి: Agniveers: అగ్నివీర్‌లకు ఈ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌లు!

అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ నాయకులతో కలిసి వీక్షించారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చాన్నారు. ఆయా సమావేశాల్లో నాయకులు సునీల్‌ మండల్‌జైన్‌, రమాకాంత్‌, శివ, విజయ్‌, కిషన్‌, సాయికృష్ణ, విజయ్‌సింగ్‌, రాణి, కృష్ణస్వామి, అనిల్‌, మధుకర్‌, మురళీధర్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags