Sanjana Bhat Secures 500/500 Marks in CBSE 10th Exam : 500/500 మార్కులు సాధించానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మే 12వ తేదీన విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
Sanjana Bhat, CBSE 10th Class Top Ranker

ఈ ప‌రీక్ష‌ల‌కు దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  

గతేడాది (94.40శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, బెంగళూరులో 99.18శాతం, చెన్నైలో 99.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,95,799 మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 44,297 మంది 95శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించినట్లు బోర్డు తెలిపింది.

☛➤ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ సారి మెరిట్ జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో చెన్నైకి చెందిన సంజనా భట్ అత్య‌ధిక మార్కులు సాధించింది. అలాగే సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి టాప‌ర్స్ 2023లో ఈమె ఒక‌రిగా నిలిచింది.

100 శాతం సాధించేందుకు.. ఈమె..

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2023లో నూరు శాతం పొందేందుకు సంజనా భట్ 500కి 500 మార్కులు సాధించింది. ఆమె సీబీఎస్ఈ బోర్డుతో పాటు తన పాఠశాల పద్మా శేషాద్రి బాలభవన్, నుంగంబాక్కంలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఇంగ్లీషు, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్ అన్ని సబ్జెక్టులలో పూర్తి మార్కులు సాధించడం విశేషం.

☛➤ 10th Class Student Success Story : అమ్మ లేదు.. నాన్నా ఉన్న రాడు.. ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొని టాప్ మార్కులు కొట్టిందిలా.. కానీ..

అలాగే సంజ‌న‌కు  Physics, chemistry and maths ఇష్ట‌మైన స‌బ్జెక్ట్‌లు. సంజ‌న ప‌రీక్ష‌లు రాసిన త‌ర్వాత 490 మార్కుల వ‌చ్చే అవ‌కాశం ఉంది అనుకున్నారు. కాని అనూహ్యంగా 500/500 కి వ‌చ్చే స‌రిగా ఆశ్చ‌ర్య‌ప‌డ‌డం త‌న వంతైంది. ఇన్ని మార్కులు రావ‌డంతో సంజ‌న చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

సంజనా చిన్నతనం నుంచే..
సంజన తల్లి శుభ సర్జన్‌గా పనిచేస్తున్నారు. తన కూతురు సాధించిన దానికి ఆమె గర్వంగా, సంతోషంగా ఫీలవుతున్నారు. ఇదే సమయంలో ఆమె భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. సంజనా చిన్నతనం నుంచే ప్రతిభ కనబరుస్తోందని ఆమె అన్నారు. తన కూతురు రెగ్యులర్‌గా చదివుతుండేదని, ఎప్పుడూ చదువులో బోర్ ఫీలవ్వలేదని అన్నారు. అసైన్‌మెంట్లు కూడా నిర్ణీత సమయానికి కంటే ముందే చేసేసేదని తెలిపారు.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

అంతా డాక్టర్లే.. కానీ సంజ‌నా మాత్రం..
ఇంట్లో అంతా డాక్టర్లే ఉన్నప్పటికీ సంజనా ఇంజనీర్ చేయాలనుకుంటోంది. జెఈఈ అడ్వాన్స్‌కు, ఐఐటికి ప్రయత్నించాలనుకుంటోంది. ఇదే విషయాన్ని సంజన తల్లి తెలిపారు.

☛ SSC 2023: కవలలకు 10 జీపీఏ.. ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు..

#Tags