Skip to main content

CBSE 10th Result 2022 Toppers : సీబీఎస్‌ఈ టెన్త్‌ టాపర్లు వీరే.. ఇలా అర్థం చేసుకుని చదివా.. పూర్తి మార్కులు సాధించానిలా..

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం మంది పాసయ్యారు.
CBSE 10th Result 2022 Topper
దియా నామ్‌దేవ్

ట్రాన్స్ జండర్లు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు.  11.32 శాతం విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా.. 3.10 శాతం విద్యార్థులు 95 శాతం స్కోర్‌ చేశారు. బాలికల్లో దియా నామ్‌దేవ్, బాలురలో మయాంక్‌ యాదవ్‌ నేషనల్‌ టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం.

CBSE 10th Result 2022 : ఎట్ట‌కేల‌కు సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

ఇలా అర్థం చేసుకుని చదివా..

దియా నామ్‌దేవ్


షామ్లీ జిల్లాకు చెందిన దియా నామ్‌దేవ్.. స్థానిక స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను టాపర్‌గా నిలిచానని దియా నామ్‌దేవ్ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను. నేను ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు చదువుకున్నాను. కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని చదవడం వల్ల టాపర్‌గా నిలిచాన’ని అన్నారు.

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు ఇవే.. ఈ సారి మాత్రం..

అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించానిలా..

మయాంక్‌ యాదవ్‌


నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివిన మయాంక్‌ యాదవ్‌ కూడా 100 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకుని సత్తా చాటాడు. టాపర్‌గా నిలవడం పట్ల మయాంక్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఫ‌లితాల్లో త్రివేండ్రం టాప్‌.. గువాహటి లాస్ట్‌..
సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో త్రివేండ్రం ముందు వరుసలో నిలిచింది. త్రివేండ్రంలో అత్యధికంగా 99.68 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గువాహటి 82.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీలో 86.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తూర్పు ఢిల్లీలో 86.96 శాతం, పశ్చిమఢిల్లీలో 85.94 శాతం ఉత్తీర్ణత నమోదయింది.

CBSE 12th Result 2022 Link : సీబీఎస్‌ఈ 12వ తగరతి ఫలితాలు విడుదల.. ఈ వెయిటేజీ మార్కులను కలిపి..

Published date : 22 Jul 2022 08:32PM

Photo Stories