‘ఎంబీఏ’ అభ్యర్థులకు కార్పొరేట్ కొలువులు...
ఎంబీఏ పట్టా చేతికందినా..ఉద్యోగం వస్తుందా.. రాదా? అనే ఆందోళన!
వస్తే క్యాంపస్ ఆఫర్ రావాలి.. లేదంటే జాబ్ మార్కెట్‌లో కొలువు కష్టమే.
ఎంబీఏ విద్యార్థుల్లో.. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంతంతమాత్రమే అంటూ..
పలు సంస్థల అభిప్రాయం!! ప్రస్తుతం దేశంలో ఎంబీఏ అభ్యర్థులకు ఎదురవుతున్న పరిస్థితులివి! కానీ.. స్కిల్స్ ఉంటే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది అంటున్నాయి తాజా సర్వేలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ
బీస్కూల్స్ అసోసియేషన్ జీమ్యాక్(గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్) నిర్వహించిన..‘కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే’లో..76శాతం సంస్థలు తాము ఈ ఏడాది ఎంబీఏ ఫ్రెషర్స్ హైరింగ్ చేపడతామని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో.. ఎంబీఏలకు కార్పొరేట్ కొలువులు.. జాబ్ మార్కెట్ ట్రెండ్‌స.. వేతనాల గురించి సర్వే వెల్లడించిన వివరాలపై విశ్లేషణ...
మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ) విద్యార్థులకు గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) తీపి కబురు చెప్పింది. కార్పొరేట్ కొలువే లక్ష్యంగా ఎంబీఏలో చేరిన అభ్యర్థులకు ఉజ్వల అవకాశాలు పలకరించనున్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఫార్చ్యూన్-100, 500 సంస్థలు మొదలు స్థానిక కంపెనీల వరకూ.. 2019 లో భారీగా నియామకాలు చేపట్టనున్నాయని జీమ్యాక్ కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే-2019 వెల్లడించింది. అంతర్జాతీయంగా 45 దేశాల్లోని మొత్తం 1202 కంపెనీలను సంప్రదించి.. వారి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను రూపొందించింది.
76 శాతం సంస్థలు ఓకే..
జీమ్యాక్ కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే ప్రకారం-అంతర్జాతీయంగా 76శాతం సంస్థలు ఎంబీఏ ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు సానుకూలంగా స్పందించాయి. గతేడాదితో పోల్చితే ఇది తొమ్మిది శాతం అధికంగా ఉండటం విశేషం. అంతర్జాతీయంగా మొత్తం మూడు ప్రాంతాలుగా(ఆసియా-పసిఫిక్ రీజియన్, యూరోప్, యూఎస్) విభజించి నిర్వహించిన సర్వే ప్రకారం- 2019లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో అత్యధికంగా ఎంబీఏ ఫ్రెషర్ హైరింగ్స్ జరిగే వీలుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో 87 శాతం సంస్థలు, యూరోపియన్ యూనియన్‌లో 69 శాతం సంస్థలు, అమెరికాలో 77 శాతం సంస్థలు 2019లో ఎంబీఏలను నియమించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రంగాల వారీగా చూస్తే.. కన్సల్టింగ్, ఎనర్జీ/యుటిలిటీస్, హెల్త్‌కేర్, టెక్నాలజీ విభాగాల్లో నియామకాలు అధికంగా ఉంటాయని అంచనా.
ఎంబీఏతోపాటు ఇతర కోర్సుల్లోనూ..
ఎంబీఏతోపాటు ఇతర కోర్సులకు సంబంధించి కూడా ఈ ఏడాది ఫ్రెషర్స్ హైరింగ్స్ పెరుగుతాయని జీమ్యాక్ సర్వే తెలిపింది. మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ 42 శాతం; మాస్టర్ ఆఫ్ అకౌంటింగ్ 36 శాతం; మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ 37 శాతం; మాస్టర్ ఆఫ్ డేటా అనలిటిక్స్ 52 శాతం; ఇతర పీజీ కోర్సులు 60 శాతం; బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు 87 శాతం; ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌డ్ హైరింగ్స్ 87 శాతం ఉంటాయని పేర్కొంది.
‘స్పెషలైజ్డ్’ పీజీలకు పెద్దపీట :
ఇతర స్పెషలైజ్డ్ కోర్సుల విద్యార్థుల పట్ల కూడా సంస్థలు సానుకూలంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. నియామకాల పరంగా చూస్తే.. మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(27 శాతం); మాస్టర్ ఆఫ్ సప్లయ్ చైన్ (22 శాతం), మాస్టర్ ఆఫ్ మార్కెటింగ్(21 శాతం); మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్(18 శాతం); మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(18 శాతం)తో టాప్-5 జాబితాలో నిలిచాయి. వీటితోపాటు ఎకనామిక్స్,హెల్త్ అడ్మినిస్ట్రేషన్, రిస్క్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ విభాగాల్లో పూర్తి స్థాయి పీజీ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగాలు లభించే అవకాశముందని జీమ్యాక్ సర్వే పేర్కొంది. మార్కెటింగ్ 36శాతం; ఎకనామిక్స్ 36శాతం; ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ 34శాతం; సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ 34శాతం; ఐటీ 28శాతం; హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ 26శాతం; కమ్యూనికేషన్స్ 21శాతం; ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ 15శాతం; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో 9శాతం మేర నియామకాలు జరగనున్నాయి.
ముఖ్యమైన విభాగాలు..
ఫ్రెషర్స్ హైరింగ్స్ పరంగా ఉద్యోగ విధులు-విభాగాల వారీగాచూస్తే.. స్ట్రాటజీ/ఇన్నోవేషన్ విభాగంలో ఎక్కువ నియామకాలు జరగనున్నాయి.
ఎంబీఏ నియామకాల్లో స్టార్టప్ సంస్థలు ముందంజలో నిలవడం విశేషం. గతేడాదిస్టార్టప్ సంస్థల్లో 45 శాతంగా ఉన్న ఫ్రెషర్స్ నియామకాలు.. 2019లో 62 శాతానికి చేరనున్నట్లు అంచనా. ఈ పరిస్థితి అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది. అన్ని దేశాల్లోనూ స్టార్టప్ ఎకో సిస్టమ్ విస్తృతం కావడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెరగనున్న వేతనాలు..
జీమ్యాక్ కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే-2019 ప్రకారం-ఈ ఏడాది ఫ్రెషర్స్ హైరింగ్ పరంగా అన్ని విభాగాల్లోనూ వేతనాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కంపెనీల యాజమాన్యాలు వేతనాల పెంపుపై సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఈ రీజియన్‌లో 63 శాతం సంస్థలు వేతనాలు పెంచుతామని పేర్కొన్నాయి. యూరప్ దేశాల్లో 49 శాతం సంస్థలు, అమెరికాలో 56 శాతం సంస్థలు వేతనాల పెంపునకు సంసిద్ధత వ్యక్తంచేశాయి. అమెరికాలోని 38 శాతం సంస్థలు ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు, 35 శాతం సంస్థలు మాస్టర్ ఆఫ్ డేటా అనలిటిక్స్ గ్రాడ్యుయేట్లకు వేతనాలు పెంచేందుకు సానుకూలంగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఫ్రెషర్స్‌కు లభించనున్న సగటు వార్షిక మూల వేతనాల అంచనాలు చూస్తే.. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో-45 వేల డాలర్లు, యూరప్‌లో-95 వేల డాలర్లు, అమెరికాలో-1.15 లక్ష డాలర్లుగా ఉంది.
మన దేశంలో ఇలా..
జీమ్యాక్ సర్వే ప్రకారం-మన దేశంలోనూ ఈ ఏడాది ఎంబీఏ ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో 87 శాతం సంస్థలు నూతన నియామకాలకు సంసిద్ధత తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో పేర్కొన్న ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే వ్యాపార కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా స్టార్టప్ సంస్థల ఏర్పాటు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. కాబట్టి మన దేశంలో ఎంబీఏలకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. అదేవిధంగా ఈ రీజియన్‌లోనే ఉన్న మన పొరుగు దేశం చైనాలోనూ అవకాశాలు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇంటర్న్‌షిప్ అవకాశాల్లోనూ పెరుగుదల :
ఎంబీఏ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా మారుతోంది. ఈ ఏడాది ఇంటర్న్ ట్రైనీ నియామకాల పరంగా కూడా సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఎంబీఏ విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీ అవకాశం కల్పిస్తామని 55శాతం సంస్థలు పేర్కొన్నాయి. ఆసియా పసిఫిక్, యూరప్ ప్రాంతాల్లో 39శాతం సంస్థలు ఎంబీఏ ఇంటర్న్ ట్రైనీ రిక్రూట్‌మెంట్‌కు అనుకూలంగా ఉన్నాయి. అలాగే అమెరికాలో ఏకంగా 58 శాతం సంస్థలు ఇంటర్న్‌లను నియమించుకుంటామని చెప్పడం విశేషం. ఫార్చ్యూన్-100 సంస్థల్లో 83 శాతం; ఫార్చ్యూన్-500 సంస్థల్లో 79 శాతం సంస్థలు ఇంటర్న్ ట్రైనీ రిక్రూట్‌మెంట్స్‌కు సంసిద్ధత తెలిపాయి.
జీమ్యాక్ కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే-2019.. ముఖ్యాంశాలు

- స్ట్రాటజీ/ఇన్నోవేషన్-45శాతం, ఫైనాన్స్-43శాతం, బిజినెస్ ఇంటెలిజెన్స్/ అనలిటిక్స్-40శాతం, మార్కెటింగ్-38శాతం, కన్సల్టింగ్-37శాతం,జనరల్ మేనేజ్‌మెంట్-34శాతం, బిజినెస్ డెవలప్‌మెంట్/సేల్స్-34శాతం, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్-27శాతం, ఆపరేషన్స్/లాజిస్టిక్స్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్-26 శాతం మేర రిక్రూట్‌మెంట్స్ జరుగనున్నట్లు అంచనా.
- ఆసియా-పసిఫిక్ రీజియన్, యూరోపియన్ యూనియన్‌లో కన్సల్టింగ్‌కు బాగా డిమాండ్ ఉంది. యూఎస్‌లో మాత్రం ఫైనాన్స్‌కు డిమాండ్ నెలకొనడం విశేషం.
- జీమ్యాక్ సర్వే ప్రకారం-అమెరికాలోని 48 శాతం సంస్థలు విదేశీ ఎంబీఏ విద్యార్థులను నియమించుకునేందుకు ఆసక్తి చూపడం విశేషం. హెచ్-1బి ఆంక్షలు ఉన్నప్పటికీ.. అమెరికా కంపెనీలు భారీగా విదేశీ ఎంబీఏలను నియమించుకుంటామని చెప్పడం వర్క్ అబ్రాడ్ యూఎస్ ఆశావహులకు శుభపరిణామంగా చెప్పొచ్చు.
- యూరోపియన్ యూనియన్‌లోని సంస్థల్లో 71శాతం సంస్థలు, ఆసియా-పసిఫిక్ రీజియన్ దేశాల్లో 69 శాతం సంస్థలు విదేశీ విద్యార్థులను నియమించుకుంటామని పేర్కొన్నాయి.
ఎంబీఏ నియామకాల్లో స్టార్టప్ సంస్థలు ముందంజలో నిలవడం విశేషం. గతేడాదిస్టార్టప్ సంస్థల్లో 45 శాతంగా ఉన్న ఫ్రెషర్స్ నియామకాలు.. 2019లో 62 శాతానికి చేరనున్నట్లు అంచనా. ఈ పరిస్థితి అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది. అన్ని దేశాల్లోనూ స్టార్టప్ ఎకో సిస్టమ్ విస్తృతం కావడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెరగనున్న వేతనాలు..
జీమ్యాక్ కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే-2019 ప్రకారం-ఈ ఏడాది ఫ్రెషర్స్ హైరింగ్ పరంగా అన్ని విభాగాల్లోనూ వేతనాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కంపెనీల యాజమాన్యాలు వేతనాల పెంపుపై సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఈ రీజియన్‌లో 63 శాతం సంస్థలు వేతనాలు పెంచుతామని పేర్కొన్నాయి. యూరప్ దేశాల్లో 49 శాతం సంస్థలు, అమెరికాలో 56 శాతం సంస్థలు వేతనాల పెంపునకు సంసిద్ధత వ్యక్తంచేశాయి. అమెరికాలోని 38 శాతం సంస్థలు ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు, 35 శాతం సంస్థలు మాస్టర్ ఆఫ్ డేటా అనలిటిక్స్ గ్రాడ్యుయేట్లకు వేతనాలు పెంచేందుకు సానుకూలంగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఫ్రెషర్స్‌కు లభించనున్న సగటు వార్షిక మూల వేతనాల అంచనాలు చూస్తే.. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో-45 వేల డాలర్లు, యూరప్‌లో-95 వేల డాలర్లు, అమెరికాలో-1.15 లక్ష డాలర్లుగా ఉంది.
మన దేశంలో ఇలా..
జీమ్యాక్ సర్వే ప్రకారం-మన దేశంలోనూ ఈ ఏడాది ఎంబీఏ ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో 87 శాతం సంస్థలు నూతన నియామకాలకు సంసిద్ధత తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో పేర్కొన్న ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే వ్యాపార కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా స్టార్టప్ సంస్థల ఏర్పాటు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. కాబట్టి మన దేశంలో ఎంబీఏలకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. అదేవిధంగా ఈ రీజియన్‌లోనే ఉన్న మన పొరుగు దేశం చైనాలోనూ అవకాశాలు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇంటర్న్‌షిప్ అవకాశాల్లోనూ పెరుగుదల :
ఎంబీఏ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా మారుతోంది. ఈ ఏడాది ఇంటర్న్ ట్రైనీ నియామకాల పరంగా కూడా సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఎంబీఏ విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీ అవకాశం కల్పిస్తామని 55శాతం సంస్థలు పేర్కొన్నాయి. ఆసియా పసిఫిక్, యూరప్ ప్రాంతాల్లో 39శాతం సంస్థలు ఎంబీఏ ఇంటర్న్ ట్రైనీ రిక్రూట్‌మెంట్‌కు అనుకూలంగా ఉన్నాయి. అలాగే అమెరికాలో ఏకంగా 58 శాతం సంస్థలు ఇంటర్న్‌లను నియమించుకుంటామని చెప్పడం విశేషం. ఫార్చ్యూన్-100 సంస్థల్లో 83 శాతం; ఫార్చ్యూన్-500 సంస్థల్లో 79 శాతం సంస్థలు ఇంటర్న్ ట్రైనీ రిక్రూట్‌మెంట్స్‌కు సంసిద్ధత తెలిపాయి.
జీమ్యాక్ కార్పొరేట్ రిక్రూటర్స్ సర్వే-2019.. ముఖ్యాంశాలు
- అంతర్జాతీయంగా 1202 సంస్థలతో సంప్రదించి సర్వే రూపకల్పన
- ఆసియా-పసిఫిక్ రీజియన్, యూరోపియన్ యూనియన్‌లో కన్సల్టింగ్ విభాగంలో, యూఎస్‌లో ఫైనాన్స్ విభాగాల్లో డిమాండ్
- స్టార్టప్ సంస్థల్లో భారీగా పెరగనున్న ఫ్రెషర్స్ నియామకాలు
- సగటు వేతనాలు కూడా దాదాపు రెట్టింపు స్థాయిలో పెరుగుదల
- ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో భారత్, చైనాలే ముందంజలో నిలిచే పరిస్థితి
- అమెరికాలోనూ విదేశీ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు సంస్థల నుంచి డిమాండ్
- ఇంటర్న్‌ట్రైనీ నియామకాలు గత ఏడాది కంటే భారీగా పెరిగే అవకాశం
#Tags