టెక్ ఇంటర్వ్యూల్లో నెగ్గడం ఎలా?

జాబ్ ఇంటర్వ్యూలకు ప్రతి ఒక్కరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారో, అదేవిధంగా డెవెలపర్స్, ఐటీ ప్రోస్ కూడా సిద్ధమవ్వవలసి ఉంటుంది. అవును.. ఇది నిజంగా ఉపయోగపడుతుంది! రెజ్యూమె, ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యునికేషన్ స్కిల్స్... మొదలైన వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. మీ డ్రీమ్ జాబ్‌ను సొంతం చేసుకోవాలంటే టెక్నికల్ ఇంటర్వ్యూలోని అడ్డంకులను అధిగమించవలసి ఉంటుంది. మీరు మీ స్కిల్స్ ఇంటర్వ్యూలో ప్రదర్శించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. ఏ టెక్నికల్ ఇంటర్వ్యూలో అయినా ఉపకరించే కొన్ని టిప్స్ మీ కోసం...

 

బేసిక్స్‌పై పట్టు సాధించాలిటెక్నికల్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్‌పై పట్టు కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి అన్ని బేసిక్ కాన్‌సెప్ట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఇంటర్వ్యూలో అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇంకా.. గ్రాఫ్స్, సెట్స్, హాష్ టేబుల్స్, బైనరీ సెర్చ్ ట్రీస్ లపై కూడా రిక్రూటర్స్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. డేటా స్ట్రక్చర్స్ ద్వారా కోడ్‌ను రాయమని కూడా అడగవచ్చు. రిక్రూటర్స్‌ను ఇంప్రెస్ చేసే ప్రక్రియలో బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి, కనీసం రెండు ప్రోగ్రామింగ్ పుస్తకాలను పూర్తిగా చదివి, ఫుల్‌గా ప్రిపేరై ఇంటర్వ్యూకి వెళ్లాలి. ఈ విధానం మీరు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి మాత్రమే కాదు, మంచి ప్రోగ్రామర్‌గా కూడా మీకు పేరును తెచ్చిపెడుతుంది.

మీ సమాధానలే మిమ్మల్ని నిర్ణయిస్తాయి
ఇంటర్వ్యూలో అభ్యర్థులిచ్చే సమాధానాల ఆధారంగా రిక్రూటర్లు చాలా సులువుగా వారి సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు. అందువల్ల ఈ విషయాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అంతేకాకుండా ఈ రెండు టాపిక్‌ల మధ్య గల వ్యత్యాసాన్ని కూడా గ్రహించాలి. సెట్స్, హష్ టేబ్‌ల్స్‌ను ఎప్పుడు, ఎక్కడ వినియోగించాలో ఇంటర్వ్యూవర్లకు వివరించగలగాలి. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూచేసే వారికి మీ పట్ల సానుకూల దృక్పదం కలిగేలా చేస్తుంది.

కోడింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి
ఇంటర్వ్యూచేసే వారు అభ్యర్ధుల కోడింగ్ స్కిల్స్‌ను ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. కాబట్టి కోడింగ్‌కు సంబంధించిన అన్ని ప్రశ్నలపై బాగా ప్రిపేరై వెళ్లాలి. ఇంటర్‌నెట్‌లో కోడింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుంది. రియల్ టైమ్ కోడింగ్ బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంటర్వ్యూలో మెరుగ్గా నెగ్గగలరు. ఇంటర్వ్యూలో సింటాక్సెస్ మర్చిపోకండి.

ఇంటర్వ్యూలో అభ్యర్దుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, ఉద్యోగానికి సరిపోతారో లేదో నిర్ధారించడానికి రిక్రూటర్లు టెక్నికల్ అసెస్‌మెంట్స్ ద్వారా పరీక్షిస్తారు. కాబట్టి ఈ టిప్స్‌ను బాగా అర్థం చేసుకుని ఫాలో అవడం ద్వారా ఇంటర్వ్యూలో మీరు ముదంజలో ఉంటారు.

 

#Tags