FDDI AIST Notification: ఎఫ్‌డీడీఐలో ఫ్యాషన్, డిజైనింగ్‌ విభాగాల్లో కోర్సులు.. క్యాంపస్‌లు, భవిష్యత్తు అవకాశాలు ఇవే..

ఫ్యాషన్, డిజైనింగ్‌ రంగాల్లో అవకాశాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ)! డిజైనింగ్, ఫ్యాషన్‌లకు సంబంధించి పలు కోర్సులను అందిస్తున్న ఎఫ్‌డీడీఐ.. వీటిలో ప్రవేశాలకు ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా 2024కు సంబంధించి ఎఫ్‌డీడీఐ ఏఐఎస్‌టీ నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏఐఎస్‌టీ వివరాలు, ప్రవేశాలు కల్పించే కోర్సులు, క్యాంపస్‌లు, భవిష్యత్తు అవకాశాలు తదితర అంశాలపై విశ్లేషణ..
  • ఎఫ్‌డీడీఐ ఏఐఎస్‌టీ-2024 నోటిఫికేషన్‌ విడుదల
  • ఎఫ్‌డీడీఐలో డిజైన్, ఫ్యాషన్‌ విభాగాల్లో కోర్సులు
  • బ్యాచిలర్, పీజీ స్థాయిలో ప్రోగ్రామ్‌లు

ఫ్యాషన్‌ డిజైనింగ్, ప్రొడక్షన్‌లో ప్రత్యేక నైపుణ్యాలు పొందేలా యువతను తీర్చిదిద్దే ఉద్దేశంతో.. కేంద్ర పర్యాటక శాఖ నేతృత్వంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ)ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు ఉన్నాయి. అవి..నోయిడా, ఫర్సత్‌గంజ్, చెన్నై, కోల్‌కత, రోహ్‌తక్, జోథ్‌పూర్, ఛింద్వారా, గుణ, అంక్లేశ్వర్, పాట్నా, హైదరాబాద్, చండీగఢ్‌.

బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లు

  • జాతీయ స్థాయిలో ఉన్న 12 క్యాంపస్‌ల ద్వారా ప్రస్తుతం నాలుగు బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌లు, 2 పీజీ ప్రోగ్రామ్‌లను ఎఫ్‌డీడీఐ అందిస్తోంది. అవి..
  • బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌లు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌-ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌-ఫ్యాషన్‌ డిజైన్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌-లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్ససరీస్‌ ; బీబీఏ-రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్కండైజ్‌.
  • పీజీ ప్రోగ్రామ్‌లు: ఎం.డిజైన్‌-ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌; ఎంబీఏ-రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్కండైజ్‌. 
  • బ్యాచిలర్‌ ప్రోగ్రామ్స్‌లో మొత్తం 1880, పీజీ ప్రోగ్రామ్స్‌లో 480 సీట్లు చొప్పున మొత్తం 2,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

కోర్సులు-అర్హతలు

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు: ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. 
  • మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌): ఫుట్‌వేర్‌/లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌/ఫ్యాషన్‌/ఇంజనీరింగ్‌/ఫైన్‌ ఆర్ట్స్‌/ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉతీర్ణులు అర్హులు.
  • మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఫ్యాషన్‌ డిజైన్‌): బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఎంబీఏ(రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాదించాలి. 
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి: NIFT Entrance Exam 2024: ఫ్యాషన్, డిజైన్‌లో ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల కెరీర్స్‌ !

ఏఐఎస్‌టీ ర్యాంక్‌తో ప్రవేశాలు
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి.. ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌(ఏఐఎస్‌టీ) నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష విధానం యూజీ, పీజీ కోర్సులకు వేర్వేరుగా ఉంటుంది.

ఏఐఎస్‌టీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌/బీబీఏ) ఇలా
బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌లకు నిర్వహించే పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌-ఎలో అనలిటికల్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు-25 మార్కులకు; సెక్షన్‌-బిలో బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు-50 మార్కులకు, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు-50 మార్కులకు; సెక్షన్‌-సి జనరల్‌ అవేర్‌నెస్‌ 35 ప్రశ్నలు-35 మార్కులకు; సెక్షన్‌-డిలో కాంప్రహెన్షన్‌ 25 ప్రశ్నలు-25 మార్కులకు, గ్రామర్, యూసేజ్‌ 15 ప్రశ్నలు-15 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పీజీ ప్రోగ్రామ్‌లకు
పీజీ స్థాయిలో మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లకు నిర్వహించే పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌ ఏలో అనలిటికల్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు-50 మార్కులకు; సెక్షన్‌-బిలో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ గ్రామర్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు;సెక్షన్‌-సిలో జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు; సెక్షన్‌-డిలో మేనేజ్‌మెంట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. రెండు స్థాయిలకు పరీక్ష పెన్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది.

ఆకర్షణీయ వేతనాలు
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ల నుంచి బ్యాచిలర్, పీజీ పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ద్వారా రూ.లక్షల వేతనంతో కొలువులు ఖరారవుతున్నాయి. గత మూడేళ్ల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఎనభై శాతం పైగా విద్యార్థులకు ఆఫర్లు దక్కాయి. సగటు వేతనం రూ.8లక్షలుగా నమోదైంది. అడిడాస్‌ ఇండియా, ప్యూమా, ఆలైన్‌ అపారెల్స్, ఆదిత్య బిర్లా తదితర ప్రముఖ సంస్థలు ప్రముఖ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి.

లభించే ఉద్యోగాలు
ఎఫ్‌డీడీఐ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఫుట్‌వేర్‌ డిజైనర్, ప్రొడక్ట్‌ డెవలపర్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, క్వాలిటీ కంట్రోలర్, ఫుట్‌వేర్‌ టెక్నాలజిస్ట్, మెర్కండైజర్, మార్కెటింగ్, ప్లానింగ్‌ ఎగ్జిక్యూటివ్, ట్రెండ్‌ అనలిస్ట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డిజైన్‌ మ్యానుఫాక్చరింగ్‌ ఆపరేషన్స్, స్టోర్‌ మేనేజర్, ఫ్లోర్‌ మేనేజర్, ఏరియా మేనేజర్‌ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ కోర్సులు చేసిన వారికి ప్రముఖ ఈ-కామర్స్, టెక్స్‌టైల్‌ రంగాల్లోని సంస్థల్లో నిర్వహణ విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి.

చదవండి: Career Guidance: డిజైన్‌ కెరీర్స్‌కు.. దారిచూపే ఎఫ్‌డీడీఐ

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 20
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 2024, మే 6 నుంచి
  • ఏఐఎస్‌టీ పరీక్ష తేదీ: 2024 మే 12
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://fddiindia.com/admission-process

రాత పరీక్షలో రాణించేలా
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో మంచి మార్కులకు అర్థమెటిక్‌-రేషియో, మిక్చర్స్, టైమ్‌ అండ్‌ వర్క్, యావరేజ్‌స్, పర్సంటేజ్‌స్, టైమ్‌ అండ్‌ స్పీడ్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, ఇంటరెస్ట్, బేసిక్‌ స్టాటిస్టిక్స్‌పై ప్రత్యే­క దృష్టి పెట్టాలి. అదే విధంగా నెంబర్‌ ప్రాపర్టీస్, ప్రాబబిలిటీ, కౌంటింగ్‌ ప్రిన్సిపల్స్, జామెట్రీ, డెరివేటివ్స్‌(మ్యాగ్జిమా-మినిమా) వంటి ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

వెర్బల్‌ ఎబిలిటీ
ఇంగ్లిష్‌ గ్రామర్‌తోపాటు, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, సీక్వెన్సెస్, బ్లడ్‌ రిలేషన్స్, కోడింగ్, డీ-కోడింగ్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
కరెంట్‌ అఫైర్స్‌తోపాటు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ముఖ్య ఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు సంబంధించి ఏదైనా ఒక ఆకృతిని రూపొందించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి ఫ్యాషన్‌ రంగంలో తాజా పరిణామాలు, ఇండస్ట్రీ పరిణామం, వృద్ధి అంచనాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి.

#Tags