సంక్షేమానికి రూ. 12,740 కోట్లు

  • తాజా బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి 12,740.52 కోట్లు కేటాయించింది. కేవలం ప్రణాళికా వ్యయంలోనే 11,450 కోట్లు వ్యయం చేయనుంది.
  • షెడ్యూల్ కులాల సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 5,547 కోట్లు కేటాయించగా, అందులో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 646.52 కోట్లు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు రూ. 121.82 కోట్లు కేటాయించింది.
  • ఎస్సీలకు ఆర్థిక మద్దతు పథకాల కోసం రూ.1,005 కోట్లు, ఎస్సీ గృహాలకు ఉచిత విద్యుత్‌కు రూ. 65 కోట్లు, కళ్యాణలక్ష్మికి రూ. 157 కోట్లు, ఇందిరమ్మ పథకం కింద బలహీనవర్గాల ఇళ్ల స్థలాల సేకరణకు రూ. 21 కోట్లు కేటాయించింది.
  • షెడ్యుల్డ్ తెగల సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 2,878 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించగా, అందులో ప్రధానంగా క్యాపిటల్ ఔట్‌లే కింద రూ.182.48 కోట్లు, ఎస్టీల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 239.20 కోట్లు కేటాయించారు.
  • కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.162 కోట్లు, విద్యాసంస్థల కోసం రూ. 138.92 కోట్లు, ఎస్టీల ఆర్థికాభివృద్ధి కోసం రూ. 38 కోట్లు, విద్యార్థులకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ. 200 కోట్లు, కళ్యాణలక్ష్మి కింద రూ.80 కోట్లు కేటాయించారు.
  • బీసీ సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,925 కోట్లను కేటాయించగా అందులో ప్రధానంగా బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.1,367 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 252 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు రూ. 20 కోట్లు, డైట్‌చార్జీలకు 100 కోట్లు కేటాయించారు.
  • మహిళా, శిశు సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,481 కోట్లను ప్రభుత్వం కేటాయించగా, ఐసీడీఎస్ ప్రాజెక్టుకు వేతనాల కోసం రూ. 107 కోట్లు, అంగన్‌వాడీల్లో మొత్తం పౌష్టికాహార పథకానికి రూ. 704 కోట్లు, ఎస్‌ఆర్‌సీడబ్ల్యూ పథకాల కోసం రూ. 427 కోట్లు, ఆరోగ్యలక్ష్మి పథకం కోసం రూ.259 కోట్లు, సబలా పథకం కింద రూ.102 కోట్లు కేటాయించారు. మైనారిటీ సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,100 కోట్లు కేటాయించారు.
#Tags