Specialist Officer Posts : 1,040 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియామకాలు!

ట్రెడిషనల్, ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేశారా.. ఆర్థిక రంగంలో పని అనుభవం ఉందా.. బ్యాంకింగ్‌ రంగంలో సమున్నత అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా! అయితే.. మీకు చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది!!

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మొత్తం 1,040 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంపికైతే ఆయా పోస్ట్‌ను అనుసరించి రూ.22 లక్షలు–రూ.66 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు! ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, వేతనాలు తదతర వివరాలు.. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు..సాంప్రదాయ బ్యాంకింగ్‌ కార్యకలాపాలతో పాటు మరెన్నో విభాగాల్లో సేవలందిస్తున్నాయి. ఆయా విభాగాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు నిపుణులైన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఎస్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ఆ కోవలోనిదే! బ్యాంకులో కీలకమైన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఈ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ స్థాయిలో వేతనాలు అందించనున్నారు.

Eighth Class Admissions 2025 : ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో 8వ‌ తరగతి ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష విధానం ఇలా..!

మొత్తం పోస్టుల సంఖ్య 1,040
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. తాజాగా విడుదల చేసిన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,040 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ (ప్రొడక్ట్‌ లీడ్‌)–2 పోస్టులు, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌(సపోర్ట్‌)–2 పోస్టులు, ప్రాజె­క్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (టెక్నాలజీ)–1 పోస్టు­లు, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (బిజినెస్‌)–2 పోస్టులు,రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–273 పోస్టులు, వైస్‌ ప్రెసిడెంట్‌–వెల్త్‌ –643 పోస్టులు, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–టీమ్‌ లీడ్‌–32 పోస్టులు, రీజనల్‌ హెడ్‌–6 పోస్టులు, ఇన్వెస్ట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌–30 పోస్టులు, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌–49 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు వేర్వేరుగా
→    వివిధ పోస్టులకు అర్హతలను కూడా వేర్వేరుగా నిర్దేశించారు. ఆయా పోస్ట్‌లను అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ/ఎంబీఏ/నిర్దేశిత స్పెషలైజేషన్లలో పీజీ/పీజీడీఎం /పీజీడీబీఎం/బీటెక్‌/ఎంటెక్‌/సీఏ/సీఎఫ్‌ఏ/ ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికెట్‌ ఉత్తీర్ణత ఉండాలి.
→    వయసు: ఆయా పోస్ట్‌లను అనుసరించి కనిష్టంగా 23ఏళ్లు, గరిష్టంగా 50 ఏళ్లు ఉండాలి. విద్యార్హతలు, పని అనుభవం, వయో పరిమితికి సంబంధించి ఏప్రిల్‌ 1, 2024ను గడువు తేదీగా పేర్కొన్నారు.

Group B and C Posts : ఇండియన్‌ నేవీలో గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టులు.. వివ‌రాలు ఇలా..

ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా
ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులను తొలుత వడపోస్తారు. అభ్యర్థులు పొందిన అకడమిక్‌ మార్కులు, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. అభ్యర్థుల పని అనుభవం, ఇప్పటివరకు వారు నిర్వర్తించిన విధులు, బ్యాంకింగ్‌ రంగంలో తాజా పరిణామాలపై అవగాహన, వ్యక్తిగత దృక్పథం, వైఖరి వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్లు, ఇంటర్వ్యూలో పొందిన మార్కులు, పని అనుభవం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని తుది నియామకం ఖరారు చేస్తారు.

అయిదేళ్ల కాంట్రాక్ట్‌
ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి, నియామకాలు ఖరారు చేసుకున్న వారు అయిదేళ్లపాటు బ్యాంకులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొదటి ఏడాదిని ప్రొబేషన్‌ కాలంగా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో వారు తమకు కేటాయించిన విభాగాల్లో ప్రణాళికల రూపకల్పన, నివేదికలు రూపొందించడం, ఉన్నతాధికారులకు సహకరించడం వంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.

RBI Recruitment 2024 : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 94 ఆఫీసర్‌ గ్రేడ్‌–బి పోస్టులు..

ముంబై, సర్కిల్‌ ఆఫీస్‌ల్లో

ఆయా పోస్ట్‌లకు ఎంపికైన వారు బ్యాంకు ప్రధా­న కార్యాలయం ముంబైతోపాటు సర్కిల్‌ కార్యాలయాలల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ (ప్రొడక్ట్‌ లీడ్, సపోర్ట్‌), ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (టెక్నాలజీ), ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (బిజినెస్‌) పోస్ట్‌ల అభ్యర్థులు ముంబై కార్యాలయంలోనే విధులు ని­ర్వర్తించాల్సి ఉంటుంది. మిగతా పోస్ట్‌లకు సంబంధించి బ్యాంకు సర్కిల్‌ ఆఫీస్‌లలో పని చేయాలి. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు మూడు సర్కి­ల్‌ ఆఫీస్‌లను తమ ప్రాథమ్యాలుగా పేర్కొనొచ్చు.

రూ.లక్షల్లో వేతనాలు
సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ పోస్టుకు (ప్రొడక్ట్‌ లీడ్‌)కు రూ.61 లక్షలు; సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌ పోస్టుకు (సపోర్ట్‌)కు రూ.20.5 లక్షలు; ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (టెక్నాలజీ), ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌(బిజినెస్‌), రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్ట్‌లకు రూ.­30 లక్షలు చొప్పున; వీపీ–వెల్త్‌కు రూ.45 లక్షలు; రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ –టీమ్‌లీడ్‌కు రూ.52 లక్షలు; రీజనల్‌ హెడ్‌కు రూ.66.5 లక్షలు; ఇన్వెస్ట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌కు రూ.44లక్షలు;ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌కు రూ.26.5 లక్షలుగా వార్షిక వేతనాన్ని నిర్దేశించారు.

INSPIRE Manak : ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రతిపాదనలకు ఆహ్వానం

ముఖ్య సమాచారం
→    దరఖాస్తు విధానం: ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్‌బీఐ బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని కెరీర్స్‌ విభాగంలో ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.
→    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్‌ 8.
→    పర్సనల్‌ ఇంటర్వ్యూలు: సెప్టెంబర్‌ రెండో వారంలో నిర్వహించే అవకాశం.
→    పర్సనల్‌ ఇంటర్వ్యూ కేంద్రాలు: ముంబై.
→    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers/current-openings

Law UG and PG Courses : లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు క్లాట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

#Tags