Job Notification : ఐబీపీఎస్‌లో ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌).. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో)/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 4,445(ఎస్సీ–657, ఎస్టీ–332, ఓబీసీ–1185, ఈడబ్ల్యూఎస్‌–435, యూఆర్‌–1846).
»    బ్యాంక్‌ల వారీగా ఖాళీలు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–885, కెనరా బ్యాంక్‌–750, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–2000, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌–260, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌–200, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్‌ –360. 
»    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 01.08.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
»    ప్రిలిమ్స్‌: రాత పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు  100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(30 ప్రశ్నలు–30 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(35 ప్రశ్నలు–35 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు–35 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్‌/హిందీ. పరీక్ష సమయం 60 నిమిషాలు.

Anganwadi Salaries : అంగ‌న్వాడీల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. వేత‌నం పెంచ‌డంలో మంత్రి సీత‌క్క వివ‌ర‌ణ‌.. కాని!

»    మెయిన్‌ ఎగ్జామినేషన్‌: మొత్తం 155 ప్రశ్నలతో 200 మార్కులకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌(45 ప్రశ్నలు–60 మార్కులు), జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(35 ప్రశ్నలు–40 మార్కులు), డేటా అనాలసిస్‌–ఇంటర్‌ప్రెటేషన్‌(35 ప్రశ్నలు–60 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్‌/హిందీ. పరీక్షసమయం 3 గంటలు. 
»    ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో లెటర్‌ రైటింగ్‌–ఎస్సే 25 మార్కులకు రెండు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్‌. పరీక్ష సమయం 30 నిమిషాలు.
»    తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌.
»    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్‌ సికింద్రాబాద్, కరీంనగర్‌.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.08.2024.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.08.2024.
»    ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: అక్టోబర్‌ 2024.
»    ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్‌ 2024.
»    ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: నవంబర్‌ 2024.
»    ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2025.
»    తుది నియామకాలు: ఏప్రిల్‌ 2025.
»    వెబ్‌సైట్‌: https://www.ibps.in

Good News for Govt Employees : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెర‌గ‌నున్న బేసిక్ పే.. శుభ‌వార్తను అందించిన కేంద్రం..!

#Tags