స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Jobs in Union Bank of India: 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎంపిక విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్...
- 606 పోస్ట్‌ల భర్తీకి యూనియన్ బ్యాంక్ నోటిఫికేషన్
- ప్రొఫెషనల్ డిగ్రీలతో పోటీ పడే అవకాశం
- రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
- వేతనం నెలకు రూ.40 వేల నుంచి రూ.80 వేలు
ఇంజనీరింగ్, ఎంబీఏ, సీఏ.. ఇలా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ప్రభుత్వ కొలువుల వైపు దృష్టి పెడుతున్నారు. వారు ప్రభుత్వ రంగంలో తమ అర్హతలకు సరితూగే పోస్ట్‌ల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ చక్కటి అవకాశమని చెప్పొచ్చు. యూబీఐ.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌లకు సంబంధించి సొంతగా నియామక విధానాన్ని చేపడుతోంది.
మొత్తం 606 పోస్ట్‌లు
యూబీఐ.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్‌లను బట్టి.. వీటిని జేఎంజీఎస్–1, ఎంఎంజీఎస్–2,3; ఎస్‌ఎంజీఎస్–4 గ్రేడ్‌లుగా వర్గీకరించారు.
అర్హతలు వేర్వేరుగా
ఆయా పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ తదితర అర్హతలతోపాటు అనుభవం ఉండాలి.
వయసు
ఫిబ్రవరి 1, 2024నాటికి చీఫ్ మేనేజర్ పోస్ట్‌లకు 30–45 ఏళ్లు; ఐటీ సీనియర్ మేనేజర్ పోస్ట్‌లకు 28 –38 ఏళ్లు; సీనియర్ మేనేజర్ (సీఏ, రిస్క్), మేనేజర్ పోస్ట్‌లకు 25–35 ఏళ్లు; మేనేజర్ (రిస్క్) పోస్ట్‌లకు 25–32 ఏళ్లు; మేనేజర్ (లా) పోస్ట్‌లకు 26–32 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లకు 20–30 ఏళ్ల వయసు ఉండాలి.
చదవండి: PNB Notification 2024: 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రాత పరీక్ష.. ఇలా
మూడంచెల ఎంపిక విధానం
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ మూడింటిలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు.
రాత పరీక్ష.. వేర్వేరుగా
- తొలి దశ రాత పరీక్షను ఆయా పోస్ట్‌లకు సంబంధించి వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తారు.
- చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షను సంబంధిత సబ్జెక్ట్‌లో 100 ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
- అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లకు రాత పరీక్షను నాలుగు విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–25 మార్కులు; రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు; సంబంధిత సబ్జెక్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు–100 మార్కులు; ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కును తగ్గిస్తారు.
- అన్ని పోస్ట్‌లకు రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ టెస్ట్‌గా నిర్వహిస్తారు.
గ్రూప్ డిస్కషన్
అభ్యర్థులు రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దేశిత కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకొని గ్రూప్ డిస్కషన్‌కు ఎంపిక చేస్తారు. గ్రూప్ డిస్కషన్‌లో నిర్దేశిత టాపిక్‌ను పేర్కొని దానిపై చర్చించమని అడుగుతారు. 50 మార్కులకు నిర్వహించే జీడీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 25 మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు పొందాలి.
చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. రిజర్వేషన్ వర్గాల వారీగా నిర్దిష్ట కటాఫ్‌లను పరిగణించి.. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఇందులో అకడమిక్ నాలెడ్జ్, పని అనుభవం, భావ వ్యక్తీకరణ, ఆలోచన సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
తుది జాబితా ఇలా
తుది జాబితా రూపకల్పనలో ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ రాత పరీక్ష నిర్వహించకుంటే.. ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు. జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలను మాత్రమే నిర్వహిస్తే.. ఈ రెండింటిలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు.
ఆకర్షణీయ వేతనం
తుది జాబితాలో చోటు సాధించి.. నియామకాలు ఖరారు చేసుకున్న వారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. చీఫ్ మేనేజర్ పోస్ట్‌లకు ఎస్‌ఎంజీఎస్–4 హోదాలో రూ.76,010–రూ.89,890; సీనియర్ మేనేజర్ పోస్ట్‌లకు ఎంఎంజీఎస్–3 హోదాలో రూ. 63,840–రూ.78,230; మేనేజర్ పోస్ట్‌లకు ఎంఎంజీఎస్–2 హోదాలో రూ.48,170–రూ.69,810; అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లకు జేఎంజీఎస్–1 హోదాలో రూ. 36,000–రూ.63,840 శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024,ఫిబ్రవరి 23
- రాత పరీక్ష తేదీ: మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx
రాత పరీక్షలో రాణించేలా
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
రీజనింగ్
ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో కీలకమైన రీజనింగ్ కోసం అభ్యర్థులు పటిష్ట ప్రిపరేషన్ సాగించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి.రీడింగ్ కాంప్రహెన్షన్,కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్
ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో స్కోర్ కోసం అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్, దానికి సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: IDBI Bank Recruitment 2024: 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :