Groups Preparation on Ozone Layer : ఓజోన్ పొర‌ను క్షీనింప చేసే వాయువు ఏది?

మొక్కలు, జంతువుల సరైన పెరుగుదలకు నత్రజని అత్యంత ఆవశ్యక మూలకం. ప్రోటీన్ల నిర్మాణంలో ముఖ్యమైన మూలకం నైట్రోజన్‌. ఉగ్రవాదులు వాడే విస్ఫోటనకారుల్లోనూ నైట్రోజన్‌ ప్రముఖంగా ఉంటుంది. మెరుపులు, ధ్వని వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే సూపర్‌ సోనిక్‌ జెట్‌ విమానాల వల్ల నైట్రిక్‌ ఆక్సైడ్‌ వాతావరణంలోకి చేరుతుంది. ఇది ‘ఓజోన్‌’ పొరను క్షీణింపజేస్తుంది. 

నత్రజని (Nitrogen)

గాలిలో సుమారు 80 శాతం నైట్రోజన్‌ ఉంటుంది. ఇది ఆక్సిజన్‌కు విలీనకారిగా పనిచేస్తుంది. మొక్కలు, జంతువులు వాతావరణంలోని నత్రజని వాయువును నేరుగా శోషించుకోలేవు. మొక్కలు నైట్రోజన్‌ను అమ్మోనియం లేదా నైట్రేట్‌ లవణాల రూపంలో భూమిపై పొరల నుంచి గ్రహిస్తాయి.
నత్రజని స్థాపన: వాతావరణంలోని నైట్రోజన్‌ వాయువును మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియం, నైట్రేట్‌ లవణాలుగా మార్చడాన్ని ‘నైట్రోజన్‌ స్థాపన’ అంటారు. ఇలా నైట్రేట్‌లుగా మార్చిన నైట్రోజన్‌ను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించిప్రోటీన్లను (పప్పు దినుసులు) తయారు చేస్తాయి.
Schools Closed Today Due To Rains: నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?
మేఘాల రాపిడి వల్ల మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్‌ వాయువులు కలిసి నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఏర్పరుస్తాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ గాలిలోని ఆక్సిజన్‌తో చర్యనొంది నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ను ఇస్తుంది. ఇది నీటిలో కరిగి నైట్రికామ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇలా ఏర్పడిన నైట్రికామ్లం భూమిని చేరి, భూమిలోని సోడియం, పొటాషియం, కాల్షియం తదితర లోహాలతో చర్య జరిపి వాటి నైట్రేట్లను ఏర్పరుస్తుంది.
హేబర్‌ పద్ధతి ద్వారా పారిశ్రామికంగా, వాతావారణంలోని నైట్రోజన్‌ వాయువును అమ్మోనియాగా మారుస్తారు. అమ్మోనియాను నైట్రికామ్లం తయారీలో వినియోగిస్తారు. ఇది నైట్రేట్‌ ఎరువుల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది.
బఠానీ, చిక్కుడు లాంటి ‘లెగ్యుమినేసి’ జాతి మొక్కల వేరుబుడిపెల్లో వాతావరణంలోని నైట్రోజన్‌ను.. నైట్రోజన్‌ సమ్మేళనాలుగా స్థిరీకరించగలిగే ప్రత్యేక రకమైన ‘సహజీవన ( Sy­m­biotic)’ బ్యాక్టీరియా ఉంటుంది.
నైట్రోజన్‌ వలయం: వాతావరణంలోని నైట్రోజన్‌ వివిధ ప్రక్రియల ద్వారా భూమిని, దాని ద్వారా మొక్కలను చేరడం.. తిరిగి వాతావరణంలోకి చేరడం ఒక చక్రీయ క్రమంలో జరుగుతుంది. దీన్నే ‘నైట్రోజన్‌ వలయం’ అంటారు.
మెరుపులు, ఆమ్ల వర్షాలు, సహజీవన బ్యాక్టీరియా ద్వారా నైట్రోజన్‌ భూమిలోకి, అక్కడి నుంచి మొక్కలను చేరుతుంది.
మొక్కలు, జంతువుల్లో ఉండే అత్యంత సంక్లిష్టమైన ప్రోటీన్లు (మాంసకృత్తులు) మొదట యూరియాగా.. చివరగా అమ్మోనియం లవణాలుగా మారుతాయి. 
State Military Schools Admissions : రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో ఈ తరగతుల్లో ప్రవేశాలకు సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..
చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలు, వాటి వ్యర్థ పదార్థాలు ‘అమ్మోనిఫైయింగ్‌ బ్యాక్టీరియా’ వల్ల అమ్మోనియా, అమ్మోనియం లవణాలుగా నిక్షిప్తమవుతాయి. వీటిలో కొంత భాగం ‘నైట్రసోఫైయింగ్‌ బ్యాక్టీరియా’ వల్ల నైట్రేట్లుగా మారుతుంది.
డీనైట్రిఫైయింగ్‌ బ్యాక్టీరియా అమ్మోనియం లవణాలను తిరిగి నైట్రోజన్‌గా మార్పు చెందిస్తుంది. ఈవిధంగా ఏర్పడిన నైట్రోజన్‌  వాతావరణంలోకి చేరుతుంది. తద్వారా వాతావరణంలో నైట్రోజన్‌ శాతం స్థిరంగా ఉంటుంది.

నైట్రోజన్‌ – ముఖ్యమైన అంశాలు

నైట్రస్‌ ఆక్సైడ్‌ అనేది నైట్రోజన్‌ తటస్థ ఆక్సైడ్‌. దీన్నే ‘లాఫింగ్‌ గ్యాస్‌’ అంటారు.
అమ్మోనియాను ఐస్‌ తయారీలో శీతలీకరణిగా ఉపయోగిస్తారు. 
ఓజోన్‌తో పాటు నైట్రిక్‌ ఆక్సైడ్, పెరాక్సీ ఎసిటైల్‌ నైట్రేట్లు (PAN) కాంతి రసాయన స్మాగ్‌కు కారణమవుతాయి. పొగ మంచు ఏర్పడినప్పుడు కళ్లలో మంటకు కారణం ఈ రసాయనమే.
నైట్రేట్ల ఉనికిని ‘బ్రౌన్‌ వలయ పరీక్ష’ ద్వారా గుర్తిస్తారు.
నైట్రోజన్‌ -210.5oC వద్ద ఘన పదార్థంగా మారుతుంది. 
నైట్రో గ్లిజరిన్, TNT, సెల్యూలోజ్‌ నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్లు పేలుడు పదార్థాలు.
‘అమ్మోటాల్‌’ అనేది అమ్మోనియం నైట్రేట్, TNTల మిశ్రమం. అమ్మోనియం క్లోరైడ్, అల్యూమినియం పొడిల మిశ్రమం ‘అమ్మోనాల్‌’. ఈ రెండూ పేలుడు పదార్థాలే.
సల్ఫర్, బొగ్గు పొడి, పొటాషియం నైట్రేట్‌ల మిశ్రమం గన్‌ పౌడర్‌.
 పొటాషియం నైట్రేట్‌ (KNO3)ని వేడి చేస్తే ఆక్సిజన్‌ విడుదలవుతుంది.
NASA: మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం.. భూమిపైకి చేరుకునే అవకాశం
గతంలో అడిగిన ప్రశ్నలు

1.    నవ్వు పుట్టించే వాయువు ఏది? (గ్రూప్‌–1, 2012)
    1) నైట్రిక్‌ ఆక్సైడ్‌  
    2) నైట్రోజన్‌ పెరాక్సైడ్‌
    3) నైట్రస్‌ ఆక్సైడ్‌ 
    4) నైట్రోజన్‌ పెంటాక్సైడ్‌
2.    కృత్రిమ గర్భోత్పత్తికి ఉపయోగించే రేతస్సును ఎందులో భద్రపరుస్తారు?  (గ్రూప్‌–2, 2005)
    1) ద్రవ నత్రజని    2) మంచుగడ్డ
    3) ద్రవ ఆక్సిజన్‌  4) ద్రవ కార్బన్‌ డై ఆక్సైడ్‌
3.    గన్‌కాటన్‌ పేరుతో పిలిచే శక్తివంతమైన విస్ఫోటనకారి ఏది?    (గ్రూప్‌–1, 2012)
    1) పొటాషియం క్లోరేట్‌
    2) సెల్యూలోజ్‌ నైట్రేట్‌
    3) పొటాషియం నైట్రేట్‌
    4) సెల్యూలోజ్‌ ఎసిటేట్‌
సమాధానాలు
1) 3;     2) 1;     3) 2.
Anti Rape Bill: ‘అపరాజిత’.. మహిళలను కాపాడేందుకు చారిత్రాత్మక బిల్లు..
మాదిరి ప్రశ్నలు

1.    గాలిలో అయిదింట ఒక వంతు ఆక్సిజన్‌ ఉంటే మిగిలిన నాలుగు భాగాలు ఉండే వాయువు ఏది?
    1) హైడ్రోజన్‌    2) కార్బన్‌ డై ఆక్సైడ్‌
    3) నైట్రోజన్‌    4) హీలియం
2.    కిందివాటిలో నత్రజని స్థాపన చేయగలిగే మొక్క ఏది?
    I. వెదురు    II. బఠానీ
    III. చిక్కుడు    IV. వరి
    1) I, IV    2) II, III
    3) I, II    4) పైవన్నీ
3.    వీర్యాన్ని ఎందులో నిల్వ చేస్తారు?
    1) ద్రవ హైడ్రోజన్‌    2) పొడిమంచు
    3) ద్రవ హీలియం    4) ద్రవ నైట్రోజన్‌
4.    నత్రజని సమ్మేళనాలను నైట్రోజన్‌గా మార్చే బ్యాక్టీరియా ఏది?
    1) డీనైట్రిఫైయింగ్‌ బ్యాక్టీరియా
    2) సహజీవన బ్యాక్టీరియా
    3) సాల్మొనెల్లా    
    4) నైట్రిఫైయింగ్‌
5.    భూమిలో నైట్రోజన్‌ను స్థాపించే బ్యాక్టీరియా ఏది?
    1) సాల్మొనెల్లా    
    2) ఇ–కొలై
    3) సహజీవన బ్యాక్టీరియా
    4) నైట్రసోఫైయింగ్‌ బ్యాక్టీరియా
6.    పేలుడు పదార్థమైన అమ్మోనాల్‌ వేటి మిశ్రమం?
    I. అమ్మోనియం క్లోరైడ్‌
    II. అల్యూమినియం ΄÷డి
    III. టీఎన్‌టీ  
    IV. పిక్రికామ్లం
    1) I, II    2) I, III
    3) III, IV    4) II, III
7.    డ్రై సెల్‌లో ఎలక్ట్రోలైట్‌ ఏది?
    1) అమ్మోనియం క్లోరైడ్‌ (NH4Cl)
    2) అమ్మోనియం నైట్రేట్‌ (NH4NO3)
    3) యూరియా
    4) కాల్షియం సయనమైడ్‌
8.    లెగ్యుమినేసి మొక్కల వేరుబుడిపెల్లో ఉండే సహజీవన బ్యాక్టీరియా ఏది?
    1) రైజోబియం    
    2) సాల్మొనెల్లా
    3) అమ్మోనోబియం
    4) అమ్మోనిఫైయింగ్‌ బ్యాక్టీరియా
Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ వచ్చేసింది.. ఇందులో ఉండే సౌకర్యాలు ఇవే..
9.    మొక్కలు, జంతువుల సరైన పెరుగుదలకు అవసరమయ్యే ముఖ్యమైన మూలకం?
    1) హైడ్రోజన్‌    2) కార్బన్‌
    3) నైట్రోజన్‌    4) ఆక్సిజన్‌
10.    ద్రవ నైట్రోజన్‌తో పొందగలిగే ఉష్ణోగ్రత?
    1) 0oC (273 K)          2) –4oC (269 K)
    3) –196oC (177 K)    4) –273oC (0 K)
11.    కిందివాటిలో ఉత్పతనం చెందే సమ్మేళనం?
    1) యూరియా                    2) అమ్మోనియం క్లోరైడ్‌
    3) పొటాషియం నైట్రేట్‌    4) టీఎన్‌టీ
12.    మొక్కలకు చాలా అవసరమైన మూలకం ఏది?
    1) నైట్రోజన్‌    2) కార్బన్‌
    3) క్లోరిన్‌    4) పొటాషియం
13.    కోడి ఈకలను కాల్చినప్పుడు వెలువడే వాయువు ఏది?
    1) నైట్రోజన్‌    2) అమ్మోనియా
    3) ఆక్సిజన్‌    4) హైడ్రోజన్‌
14.    ఎరువుల గుట్ట నుంచి గాఢమైన (ఘాటైన) వాసనకు కారణమయ్యే వాయువు ఏది?
    1) అమ్మోనియా    2) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌
    3) నైట్రస్‌ ఆక్సైడ్‌    4) నైట్రిక్‌ ఆక్సైడ్‌
15.    స్పృహతప్పిన మనిషికి స్పృహ తెప్పించడానికి ఉపయోగించే అమ్మోనియం లవణం (స్మెల్లింగ్‌ సాల్ట్‌) రసాయన నామం?
    1) అమ్మోనియం కార్బొనేట్‌
    2) అమ్మోనియం నైట్రేట్‌
    3) అమ్మోనియం సల్ఫేట్‌
    4) అమ్మోనియం క్లోరైడ్‌
16.    కిందివాటిలో ఆమ్ల వర్షానికి కారణమైనవి?
    I. నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు
    II. సల్ఫర్‌ ఆక్సైడ్‌లు
    III. ఫాస్ఫరస్‌ ఆక్సైడ్‌లు
    1) I మాత్రమే    2) I, II మాత్రమే
    3) III మాత్రమే    4) I, II, III

సమాధానాలు
    1) 3;    2) 2;    3) 4;    4) 1;
    5) 3;    6) 1;    7) 1;    8) 1;
    9) 3;    10) 3;    11) 2;    12) 1;
    13) 2;    14) 1;    15) 4;    16) 2.

Exams In September 2024: సెప్టెంబర్‌లో జరగనున్న పరీక్షల లిస్ట్‌ ఇదే..

#Tags