Departmental Exams : నేటి నుంచి డిపార్టమెంటల్ పరీక్షలు.. కఠిన నిబంధలతో..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నేటి నుంచి 23 వరకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం అంటే, డిసెంబర్ 17వ తేదీన కలెక్టరేట్‌లో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఎపిపిఎస్‌సి డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా.
రెండు కేంద్రాలు..
సమావేశంలో మాట్లాడుతూ.. పరీక్షకు పాటించాల్సిన నిబంధనలు, చేయాల్సిన ఏర్పట్లు, తదితర విషయాలపై చర్చించారు. ఈ మెరకు, 18 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న పరీక్షలు.. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు జరగనున్నాయన్నారు.
ఈ పరీక్షలకు రెండు పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేసామన్నారు. కాకినాడ పట్టణం ఎస్. అచ్చుతాపురం రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఆయాన్ డిజిటల్, కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం వద్దనున్న సాఫ్ట్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశారని వివరించారు.
సమయపాలన..
ఈ పరీక్షలు డిస్క్రిప్టు, బహుళైచ్చిక పద్ధతుల్లో పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులను మాత్రం ఉదయం నిర్వహించే పరీక్షకు 8:30 నుంచి 9:30 మధ్యలో, మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 మధ్యలో మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు వారి వెంట డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను తీసుకురావాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఏదైనా గుర్తింపు కార్డును కూడా వెంట తీసుకురావాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
పరీక్షలకు ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లోనూ పోలీసుల పటిష్ఠ బందోబస్తు ఉండాలన్నారు. కేంద్రాల్లో మెడికల్ క్యాంపు, విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షల నిర్వాహణలో ఎటువంటి లోటు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందుకు లేకుండా ఉండాలని ఆదేశించారు కలెక్టర్ రాహుల్ మీనా.
ఈ సమావేశంలో ఎపీపీఎస్సీ సెక్షన్ అధికారి కె. సురేష్, ఎఎస్‌ఒ వైవిఎస్.నారాయణ, కాకినాడ ఆర్‌డిఒ కార్యాలయం ఎఒ ఠాగూర్, కాకినాడ అర్బన్, రూరల్ తహశీల్దార్లు జితేంద్ర, ఎస్‌ఎల్‌ఎన్.కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.