AP TET Top Ranker Ashwini Success Story : పెదింటి బిడ్డ‌.. టెట్ ఫ‌లితాల్లో 150/150 మార్కులు కొట్టిందిలా.. కానీ ల‌క్ష్యం ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) ఫలితాలు నవంబర్ 4వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఈ ఫ‌లితాల్లో కొండ్రు అశ్విని టెట్‌ ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించి..అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది ఈ పేదింటి బిడ్డ‌. 

కూలీ పనులు చేసుకుంటూ..

ఏపీలోని విజయనగరం జిల్లా చెందిన కొండ్రు అశ్విని టెట్‌-2024 ఫలితాల్లో పేపర్‌-1ఏ(ఎస్జీటీ)లో ఆమెకు 150/150 మార్కులు వచ్చాయి. 2014-16లో డైట్‌ పూర్తి చేసిన ఆమె వరుసగా ఐదు టెట్‌లకు పోటీపడ్డారు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో డీఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

పేద విద్యార్థులకు..

అలాగే నంద్యాల(D) గొర్విమానుపల్లె వాసి మంజుల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ 100 శాతం మార్కులు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. ప్ర‌భుత్వ‌ టీచర్ ఉద్యోగం సాధించి పేద విద్యార్థులకు టీచింగ్ చేయ‌డ‌మే మా  లక్ష్యం అని అంటున్నారు.

#Tags